»   » దీన్నే ఎటకారం అంటారు.. రోల్ ఏమిటో తెలీకుండానే ఒప్పేసుకున్నాడట

దీన్నే ఎటకారం అంటారు.. రోల్ ఏమిటో తెలీకుండానే ఒప్పేసుకున్నాడట

Posted By:
Subscribe to Filmibeat Telugu

బయో పిక్ హవా మరిన్ని రోజులు తన ప్రభావం చూపే లాగే ఉంది ఆటో బయోగ్రఫీ ల కంటే ఎక్కువగా బయో పిక్ లే వస్తున్న సమయం లో హర్యానాకు చెందిన కుస్తీ యోధుడు జీవిత చరిత్రతో 'సుల్తాన్‌'అంటూ వచ్చి బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న సల్మాన్‌ఖాన్‌. తర్వాత కూడా మరో బయో పిక్ లో నటించనున్నాడనే వార్త ఒక్క సారి అందర్నీ ఇంట్రస్ట్ గా ఆ వైపు చూసేలా చేసింది. ఇంకా విచిత్రం ఏమిటంటే అసలు సినిమాలో తన పాత్ర ఏమిటీ అని అడగకుండానే ఒప్పుకున్నాడట. మరింత షాకింగ్ ఏమిటంటే ఈ సినిమాలో సల్మాన్ మైన్ రోల్ కాదు... తన కంటే ఎంతో చిన్న స్టార్ అయిన రితేష్ దేశ్ ముఖ్ హీరో గా నటించే మరాఠీ చిత్రం లో ఒక పాత్ర చేయనున్నాడట సల్మాన్.

ఈ విషయం స్వయంగా తానే సుల్తాన్‌ సక్సెస్ మీట్ లో పాల్గొన్న సల్మాన్‌ వెల్లడించాడు. బాలీవుడ్‌ నటుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌ స్వీయ నిర్మాణంలో నటిస్తూ రూపుదిద్దుకుంటున్న మరాఠీ చిత్రం 'ఛత్రపతి శివాజీ'. ఈ చిత్రంలో తాను ప్రధాన పాత్రను పోషిస్తున్నట్లు చెర్ప్పి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసాడు. అయితే అసలు తనకి ఏపాత్ర ఇస్తారు అన్న విషయం కూదా అడగకుండానే ఒప్పేసుకున్నాడన్న మటే వింతగా ఉంది. ఎందుకంటే...

బాలీవుడ్ 'సుల్తాన్' సల్మాన్ ఖాన్ తను చేయబోయే సినిమాల పట్ల చాలా సెలక్టివ్‌గా ఉంటాడు. ఏదైనా ప్రాజెక్టును ఒప్పుకునే ముందు అనేక జాగ్రత్తలు తీసుకుంటాడు. ముందు ఈ పద్దతి లేదు గానీ ఒకటీ రెందు వరుస ఫ్లాపులు రావటం, అమీర్ ఖాన్ వంటి సహనటులు కెరీర్ లో దూసుకుపోవటం వంటి విషయాలను గమనించాక తన పద్దతి మార్చుకున్నాడు. క్యామియో అయినా, హీరో అయినా తన పాత్ర ఎలా ఉండబోతోంది అని తెలుసుకున్న తర్వాతే ఒప్పుకోవటం మొదలు పెట్టాడు.

Salman Khan to star in Riteish Deshmukh's Marathi film Shivaji

ఇంత కేర్‌ తీసుకునే సల్లూభాయ్ ఓ చిత్రానికి మాత్రం ఏం ఆలోచించలేదట. కనీసం తన రోల్ ఏంటో కూడా తెలుసుకోకుండానే చత్రపతి పై సినిమా అనగానే 'మీ సినిమాలో నేను నటిస్తున్నా' అంటూ కమిట్ అయిపోయాడట.యోధుడు, ధీరోధాత్తుడు ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా ఇది. ఒకప్పటి ముస్లిం సుల్తానుల దాడులని ఎదుర్కొన్న మహా హైందవ వీరుడి కథ. ఈ సినిమాలో తనకిచ్చేది విలన్ రోల్ అయినా పరవాలేదంటూ ముందుకొచ్చాడట సల్మాన్.

రితేష్ దేశ్‌ముఖ్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. చిత్రబృందం ఓ ముఖ్యమైన పాత్రకు సల్లూభాయ్‌ను సంప్రదించగా వివరాలేమీ అడక్కుండానే నటించేందుకు ఒప్పేసుకున్నాడట. ఓ పెద్ద స్టార్ తన సినిమాలో ఓ రోల్ చేయడానికి అంగీకరించడంతో రితేష్ ఆనందంతో తబ్బిబ్బైపోతున్నాడు. ఇది ఆయన గొప్పతనానికి నిదర్శనం అంటూ సల్మాన్‌ను ఆకాశానికెత్తేస్తున్నాడు. శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత రవి జాదవ్ దర్శకత్వం వహిస్తున్నారు.

English summary
Salman Khan to do a cameo in this Riteish Deshmukh film., Salman just confirmed the news., He was also seen in a special appearance in Lai Bhaari.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu