»   » పెళ్లి ఇష్యూ: సల్మాన్ ఖాన్ ప్రియురాలు స్పందించింది!

పెళ్లి ఇష్యూ: సల్మాన్ ఖాన్ ప్రియురాలు స్పందించింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి కొంత కాలంగా రకరకాల ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తన విదేశీ గర్ల్ ఫ్రెండ్ లులియా వేంటర్ తో సల్మాన్ కొంతకాలంగా ప్రేమలో మునిగి తలుతున్నాడని, ఈ ఏడాది డిసెంబర్లో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అసలు వీరికి ఇప్పటికే పెళ్లయిందనే రూమర్స్ కూడా హల్ చల్ చేస్తున్నాయి.

అయితే పెళ్లి గురించి సల్మాన్ ఖాన్ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఇప్పటి వరకు స్పందించలేదు. మరో వైపు సల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్ గా వార్తల్లో హాట్ టాపిక్ అయిన లులియా వేంటర్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీతో క్లోజ్ గా తిరుగుతుండటంతో ఇదంతా నిజమే అని కొందరు, అయి ఉండక పోవచ్చు అని మరికొందరు ఇలా రకరకాలు గా ఊహిచుకుంటున్నారు.

Salman's Girlfriend Lulia Vantur breaks her silence!

ఎట్టకేలకు లులియా వేంటర్ ఈ రూమర్స్ మీద నోరు విప్పారు. తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఆమె స్పందిస్తూ..'డియర్ ఫ్రెండ్స్. రూమర్స్ మీద స్పందించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అయితే ఓ విషయంలో నేను క్లియర్ చేస్తున్నాను నాకు ఇప్పటి వరకు పెళ్లి కాలేదు. పెళ్లి చేసుకోవాలనే తొందర కూడా లేదు. గాడ్ బ్లెస్ యూ ఆల్' అంటూ కామెంట్ చేసారు.

ఆమె ఎలాంటి ఖండన చేయలేదు కాబట్టి... సల్మాన్ ఖాన్ ప్రేమలో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఆమె వ్యాఖ్యలు బట్టి ఇంకా సల్మాన్ ఖాన్ తో పెళ్లి విషయంలో ఓ క్లారిటీకి రాలేదని తెలుస్తోంది. ఇద్దరూ ఇప్పుడిప్పుడే ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారని స్పష్టమవుతోంది. అందుకే ఆమె సల్మాన్ ఖాన్ ఫ్యామిలీతో క్లోజ్ గా ఉంటోందని, సల్మాన్ ఖాన్ తో ప్రేమాయణం సాగిస్తోందని అంటున్నారు.

English summary
Salman's Girlfriend Lulia Vantur took to her Instagram page to clarify, 'Dear friends, I didn't feel the need to react to any rumors... But now I think I should state clearly that I was never married and I am in no hurry to wear my wedding dress. God bless us all!'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X