సినిమా చూస్తూ ఏడ్చేసిన సమంత, స్నేహితుడిపై ప్రశంసలు!

By Bojja Kumar

Recommended Video

Chi La Sow Press Meet చి ల సౌ సినిమా ప్రెస్ మీట్

సుశాంత్‌, రుహనీ శర్మ జంటగా నటించిన చిత్రం 'చిలసౌ'. అన్నపూర్ణ స్టూడియోస్‌, సిరునీ సినీ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, భరత్‌ కుమార్‌, జస్వంత్‌ నడిపల్లి నిర్మాతలుగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఆగస్ట్‌ 3న 'చిలసౌ' విడుదలవుతుంది. ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రమోషన్లలో నాగ చైతన్య, సమంత కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. సుశాంత్ కోసం నాగ చైతన్య వస్తే... రాహుల్ రవీంద్రన్ తనకు మంచి ఫ్రెండ్ కావడంతో సమంత కూడా ఈ ప్రమోషన్స్‌లో పాలుపంచుకుంది.

ఏం చెప్పాల్సి వస్తుందో అని భయపడ్డాను

ఏం చెప్పాల్సి వస్తుందో అని భయపడ్డాను

రాహుల్ గురించి సమంత మాట్లాడుతూ... రాహుల్ మంచి హార్డ్‌వర్కర్. నటుడిగా చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ దర్శకత్వం మీద అతడికి ముందు నుండి ఆసక్తి ఎక్కువ. మంచి సినిమా చేస్తాడనే నమ్మకం ఉంది కానీ... సినిమా చూసిన తర్వాత ఏం చెప్పాల్సి వస్తుందోనని కాస్త భయపడుతూనే చూశాను.... అని సమంత తెలిపింది.

 ఏడుపొచ్చింది

ఏడుపొచ్చింది

సినిమా మొదలైన తర్వాత కథలో లీనమైపోయాను. ఫస్టాఫ్ చూస్తుండగానే నా కళ్ల వెంట నీళ్లొచ్చేశాయి. సినిమా అంత బాగా తీశాడు. రాహుల్ ఒక మంచి దర్వకుడు ఉన్నాడని చెప్పడానికి గర్వపడుతున్నాను అని సమంత చెప్పుకొచ్చారు.

చిలసౌ

చిలసౌ

సినిమా కథ విషయానికొస్తే.... పెళ్లి చూపుల్లో కలుసుకున్న ఒక అమ్మాయి .. అబ్బాయి ఓ మర్డర్ కారణంగా ఒక రాత్రంతా ఒకచోట ఉండి పోవాల్సి వస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందనేదే లైన్ చుట్టూ ఈ సినిమా సాగుతుంది.

నాగార్జున ఎంట్రీతో మరింత హైప్

నాగార్జున ఎంట్రీతో మరింత హైప్

చిలసౌ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో విడుదల చేస్తుండటంతో చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తే అటు సుశాంత్‌తో ఇటు రాహుల్ రవీంద్రన్ కెరీర్ కూడా టర్న్ అవ్వడం ఖాయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X