For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చరిత్ర సృష్టించిన అక్కినేని సమంత: సినిమాల్లోనే కాదు.. అందులోనూ హవా చూపిస్తూ రికార్డు

  |

  'ఏమాయ చేశావే' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం అయింది సమంత. మొదటి చిత్రంతోనే అద్భుతమైన నటనతో పాటు తన అందంతో మెప్పించిన ఈ సుందరి.. ఆ వెంటనే ఎన్నో అవకాశాలను అందుకుంది. తద్వారా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో భాగమైంది. తద్వారా స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ఇలా సినీ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకున్న సమంత.. 'ద ఫ్యామిలీ మ్యాన్2' అన వెబ్ సిరీస్‌తో డిజిటల్ వరల్డ్‌లోకి అడుగు పెట్టింది. ఈ నేపథ్యంలోనే అరుదైన ఘనతను అందుకుంది. వివరాల్లోకి వెళ్తే...

  ఇందుకే కదా Akkineni Samantha లేడీ సూపర్ స్టార్ అయింది !
  రెండు భాషల్లోనూ సత్తా చాటిన సమంత

  రెండు భాషల్లోనూ సత్తా చాటిన సమంత

  సుదీర్ఘ కాలంగా సినీ ప్రపంచంలో సత్తా చాటుతోన్న సమయంల.. కొంత కాలంగా వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతోంది. తెలుగులోనే కాదు.. తమిళంలోనూ ఈ బ్యూటీ ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకుంది. తద్వారా అక్కడా.. ఇక్కడా హవాను చూపిస్తూ వరుస ఆఫర్లను అందుకుంటోంది. ఈ క్రమంలోనే ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు రెమ్యూనరేషన్ అందుకుంటోంది.

  టాప్‌ను కిందకు జరిపి షాకిచ్చిన భూమిక: మరీ ఇంత ఘాటుగానా.. ఆమెనిలా చేస్తే తట్టుకోలేరు!

  పాన్ ఇండియా మూవీని పూర్తి చేసేసింది

  పాన్ ఇండియా మూవీని పూర్తి చేసేసింది

  ‘జాను'తో పరాజయాన్ని చవి చూసిన సమంత ప్రస్తుతం గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘శాకుంతలం' అనే పాన్ ఇండియా ఫిల్మ్‌లో నటిస్తోంది. షూట్ పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మిస్తున్నారు. ఇందులో మలయాళ నటుడు హీరోగా నటిస్తుండగా.. అల్లు అర్హ కూడా నటిస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

   ఆ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చేసిన సమంత

  ఆ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చేసిన సమంత

  అద్భుతమైన టాలెంట్‌తో దక్షిణాదిలోనే స్టార్ హీరోయిన్‌గా తన హవాను చూపించిన సమంత.. ఆహా సంస్థ కోసం ‘సామ్ జామ్' షోను హోస్టు చేసి డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌ను కూడా చేసింది. తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇందులో ఆమె నెగెటివ్ పాత్రను చేసిందామె.

  ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న రాశీ ఖన్నా హాట్ సెల్ఫీ: గతంలో చూడని విధంగా అందాల ఆరబోత

  రాజీ పాత్రలో అదుర్స్.. దేశ వ్యాప్తంగా క్రేజ్

  రాజీ పాత్రలో అదుర్స్.. దేశ వ్యాప్తంగా క్రేజ్

  ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2'లో మనోజ్ భాజ్‌పేయ్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించినప్పటికీ.. అక్కినేని సమంత పాత్రే ఎంతో హైలైట్ అయింది. ఇందులో ఆమె చేసిన రాజీ అనే రోల్‌కు ఎంతగానో పేరు వచ్చింది. తొలిసారి బోల్డుగా, నెగెటివ్ షేడ్స్‌తో చేసినప్పటికీ సమంత అద్భుతంగా నటించింది. దీంతో ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఫలితంగా దేశ వ్యాప్తంగా పెంచేసుకుందామె.

   సమంత ఖాతాలో ప్రతిష్టాత్మకమైన అవార్డ్

  సమంత ఖాతాలో ప్రతిష్టాత్మకమైన అవార్డ్

  ఇప్పటికే సమంత ఎన్నో అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్' డిజిటల్ రంగానికి సంబంధించిన ఉత్తమ నటి, నటుడు అవార్డులను ప్రకటించింది. ఇందులో ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో నటనకు గానూ సమంతకు ఉత్తమ నటిగా అవార్డు లభించింది. ‘సూరారై పొట్రు'కు సూర్య ఉత్తమ హీరోగా ఎంపికయ్యాడు.

  హాట్ ఫొటోతో హీటు పెంచిన లెజెండ్ హీరోయిన్: అరాచకమైన ఫోజుతో రెచ్చిపోయిన భామ

  ఈ అవార్డుపై సమంత ఎమోషనల్ పోస్ట్

  ఈ అవార్డుపై సమంత ఎమోషనల్ పోస్ట్

  ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్' ప్రకటించిన అవార్డుల్లో ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌కు గానూ ఉత్తమ నటిగా ఎంపికవడంపై సమంత స్పందించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాలో ‘క్యూట్ గర్ల్ అని పేరొందిన నాతో ఇలాంటి ప్రభావవంతమైన పాత్రను చేయించినందుకు రాజ్, డీకేకు థ్యాంక్స్. రాజీ పాత్ర నాలోని మరో కోణాన్ని బయటకు తీసింది' అని చెప్పుకొచ్చిందామె.

  English summary
  Samantha Akkineni Entry to Digital World with The Family Man 2 Web Series. Now She Got Indian Film Festival of Melbourne Award for This Web Series.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X