చైతూతో పెళ్లి తర్వాత సమంత ‘యూటర్న్’.. గాసిప్ కాదు.. వాస్తవమే..

By Rajababu

Recommended Video

సమంత ‘యూటర్న్’గాసిప్ కాదట

అక్కినేని నాగచైతన్యతో వివాహం తర్వాత సమంత నటించే చిత్రం ఏమై ఉంటుందా అనే ప్రశ్న సినీ వర్గాల్లో గతకొద్దికాలంగా నానుతున్నది. అయితే ఆ ప్రశ్నలకు సమాధానమిస్తూ సమంత ట్విట్టర్‌లో తాను నటించే చిత్రంపై క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ సమంత నటించే సినిమా ఏమిటి? తాను ట్వీట్ ఏమి చేసింది అంటే..

 యూటర్న్ రీమేక్‌లో

యూటర్న్ రీమేక్‌లో

కన్నడ సినీ పరిశ్రమలో సూపర్‌ హిట్‌గా నిలిచిన యూటర్న్ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో రీమేక్ చేయడానికి ప్లాన్ జరుగుతున్నది. ఫిబ్రవరి నెలలో యూటర్న్ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది అని సమంత ట్విట్టర్‌లో తెలిపారు.

సమంత ట్వీట్ ఇదే

2018 సంవత్సరాన్ని కెరీర్‌ కోసం పూర్తిగా ఉపయోగించుకోవాలని అనుకొంటున్నాను. కన్నడంలో పవన్ దర్శకత్వం వహించిన యూటర్న్ చిత్రం ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళ్తుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస నిర్మిస్తున్నారు. నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు అని సమంత ట్వీట్‌లో పేర్కొన్నారు.

ట్రాఫిక్ ఉల్లంఘన కథాంశంతో

ట్రాఫిక్ ఉల్లంఘన కథాంశంతో

బెంగళూరులోని ఓ ఫ్లై ఓవర్ మీద వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే కథానేపథ్యంగా యూటర్న్ రూపొందింది. రోడ్డు ప్రమాదంలో వాహనపుదారులు ప్రాణాలు కోల్పోవడంలో కొన్ని అంశాలు అనేక అనుమానాలకు దారితీస్తాయి. సస్పెన్స్, థ్రిల్లర్‌గా రూపొందే ఈ చిత్రం కన్నడలో ఘన విజయం సాధించింది.

 జర్నలిస్టు పాత్రలో సమంత

జర్నలిస్టు పాత్రలో సమంత

యూటర్న్ చిత్రంలో జర్నలిస్టు, పోలీసుల మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఈ చిత్రంలో సమంత జర్నలిస్టు పాత్రను పోషించనున్నారు.

 పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత

పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత

పెళ్లికి ముందు రాజ గారి గది2, మెర్సల్, రంగస్థలం, మహానటి, తమిళంలో విజయ్ సేతుపతి చిత్రంలో నటించింది. రాజుగారి గది2, మెర్సల్ చిత్రాలు విడుదలై ఘన విజయాన్ని సాధించాయి. ఇక రంగస్థలం, మహానటి, విజయ్ సేతుపతి చిత్రాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. పెళ్లి తర్వాత అంగీకరించిన తొలి చిత్రం యూటర్న్ కావడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X