»   » నాగచైతన్య, సమంత...ట్విట్టర్ లో క్యూట్ గా కబుర్లు

నాగచైతన్య, సమంత...ట్విట్టర్ లో క్యూట్ గా కబుర్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సమంత, నాగచైతన్య తెరపైనే కాదు ...తెరవెనక ట్విట్టర్ లోనూ సరదాగా ఒకరినొకరు టీజ్ చేసుకుంటూ ఫ్యాన్స్ కు ఆనందం కలిగిస్తున్నారు. తాజాగా నాగ చైతన్య... చేసిన ట్వీట్, దానికి సమంత ఇచ్చిన రిప్లై...మళ్లీ దానికి నాగ చైతన్య ఇచ్చిన సమాధానం.చివరగా సమంత కంక్లూజన్ ఆనందం కలిగిస్తున్నాయి. ఇంతకీ ..నాగచైతన్య ఏమన్నారు...

నాగ చైతన్య ట్వీట్ చేస్తూ.. "ఎక్కడ ప్రారంభమయ్యానో అక్కడకి వెళ్ళుతున్నాను..గౌతమ్ మీనన్ సార్..షూటింగ్ , రహమాన్ సంగీతం, ఇంకేం అడగగలను :-)" అన్నారు. దానికి సమంత సమాధానం ఇస్తూ... నువ్వు నన్ను అడగొచ్చు అంది. దానికి నాగచైతన్య వెంటనే...నేను అడుగుతాను..రేపటి నుంచి వచ్చేస్తావా అన్నాడు. దానికి ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయన్నట్లు రిప్లై ఇచ్చింది. మీరు ఇక్కడ చూడండి వారి కాన్సర్వేషన్...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అప్పుడెప్పుడో శింబు హీరోగా ఓ చిత్రాన్ని ప్రారంభించి మధ్యలోనే దాన్ని వదిలేసిన గౌతమ్ మీనన్... అజిత్ తో ఎన్నై ఆరిందల్ సినిమాను తెరకెక్కించి హిట్ అందుకున్నాడు. తెలుగులోనూ ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకోవడంతో... శింబు హీరోగా 'అచ్చం ఎన్ బదు మడమైయడా' చిత్రాన్ని పునఃప్రారంభించాడు. గతంలో ఈ సినిమాలో హీరోయిన్ గా పల్లవి అనే హీరోయిన్ ను ఫైనలైజ్ చేసినప్పటికీ... ప్రాజెక్ట్ డిలే అవ్వడంతో ఆమె పక్కకు తప్పుకుంది.

దీంతో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలెట్టిన గౌతమ్ ఎన్నో ఆశలతో సమంత వద్దకు వెళితే ఆమె కూడా నో చెప్పేసింది.... దీంతో తెలుగులోనూ నాగచైతన్యతో ఈ సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్న గౌతమ్ ప్రస్తుతం మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు.

నాగ చైతన్య, సమంత.... కలిసి నటించిన తొలి సినిమా ‘ఏమాయ చేసేవె'తోనే జోడీ అదిరింది అనిపించారు. ఇద్దరి మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ సూపర్బ్. ఆ తర్వాత వీరిద్దరూ నటించిన ‘ఆటో నగర్ సూర్య', ‘మనం' చిత్రాల్లోనే చూడముచ్చటైన జంటగా పేరు తెచ్చుకున్నారు.

 Samantha And Naga Chaitanya's Cute Conversation On Twitter

గౌతం మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా రాబోయే సినిమాలోనూ సమంతనే తీసుకుంటున్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. తాజాగా అందుతున్నసమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఆమెను కాకుండా మంజిమ మోహన్ అనే మళయాలం హీరోయిన్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

గౌతం మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏమాయ చేసావే' సినిమా తర్వాత చైతన్య కెరీర్ ఒక్కసారిగా పుంజుకుంది. తాజాగా మరోసారి నాగ చైతన్య అతని దర్శకత్వంలో చేస్తుండటం హాట్ టాపిక్ అయింది. మంజిమ మోహన్ ఇప్పటికే పలు మళయాల చిత్రాల్లో నటించింది. తెలుగులో ఆమెకు ఇదే తొలి సినిమా. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
when Chaitanya Akkineni posted about his next film with Gautham Menon, on twitter. "Nothing like being back to where it all started for me! shooting for menongautham sirs film,music by Rahman sir,what more could I ask fr:-)" the actor tweeted. Samantha was quick enough to interrupt the actor by replying, "you could ask for me." Immediately Naga Chaitanya came up with a counter reply to Samantha's witty reply and Samantha went pink blushing.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu