twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'హిమోఫిలియా' గురించి సినీనటి సమంతా వాక్

    By Srikanya
    |

    హైదరాబాద్ : అరుదుగా వచ్చే హిమోఫిలియా వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని స్టార్ హీరోయిన్ సమంతా పేర్కొన్నారు. హిమోఫిలియా సొసైటీ ఆధ్వర్యంలో హిమాయత్‌నగర్‌లోని లక్ష్మి ఆస్పత్రి వద్ద వ్యాధిపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు నడక నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సమంతా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హిమోఫిలియా వ్యాధి పై ఇప్పుడిప్పుడే ప్రజల్లో చైతన్యం వస్తోందని చెప్పారు. వ్యాధి నిర్ధరణ పరీక్షలకు మహిళలు కూడా ముందుకు రావాలని సూచించారు.

    అరుదైన వ్యాధి నియంత్రణకు వినియోగించే ఔషధాలు అత్యంత ఖరీదైనవని, వీటిని పేదలకు అందించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని సమంతా కోరారు. వ్యాధి నివారణకు చిన్నపాటి మోతాదులు అవసరమని, ఇందుకోసం అందరి సహకారం అనివార్యమని చెప్పారు. హిమోఫిలియా వ్యాధిపై దేశంలోని ఇతర పెద్ద రాష్ట్రాలు కూడా తగిన ప్రాధాన్యమిస్తూ ప్రత్యామ్నాయ నివారణ చర్యలు తీసుకుంటున్నాయని హిమోఫిలియా అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.వెంకట నారాయణ తెలిపారు. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయగలిగే వైద్యం లేదని, కాని రక్తస్రావాన్ని తగ్గించే ఇంజక్షన్లు ఖరీదైనవి ఉన్నాయని తెలిపారు.

    వీటిని సామాన్యులు భరించలేని ధరల్లో లభిస్తున్నాయన్నారు. కనీసం పేదలకు వీటిని అందించే ప్రయత్నం జరగాలన్నదే తమ సొసైటీ అభిలాషగా పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రజల్లో వ్యాధిపై అవగాహన పెంచేందుకు వాక్‌ నిర్వహిస్తున్నట్లు సొసైటీ ప్రధాన కార్యదర్శి పి.వెంకట ఫణీంద్ర వివరించారు. రక్తంలో గడ్డకట్టించే గుణం లోపించడమే హిమోఫిలియా వ్యాధి లక్షణమని, చిన్నచిన్న గాయాలకు, ఏ కారణం లేకుండానే రక్తస్రావం జరుగుతున్నట్త్లెతే తగిన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వాక్‌ హిమాయత్‌నగర్‌లోని ఉర్దూహాల్‌ మీదుగా బషీర్‌బాగ్‌ వరకు కొనసాగింది. నటి సమంతా వాక్‌ను ప్రారంభించి వెళ్లిపోగా సొసైటీ సభ్యులు కొనసాగించారు.

    English summary
    Samantha attend Hemophilia Awareness Program walk at Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X