»   » నేను నటించడం ఆపేస్తే.. నాగార్జున ఎక్కువ బాధపడతారు: సమంత

నేను నటించడం ఆపేస్తే.. నాగార్జున ఎక్కువ బాధపడతారు: సమంత

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రేమ వ్యవహారం ఇప్పుడు అంతా ఓపెన్. పెళ్లిళ్లకు..ఫంక్షన్లకు ఎంచక్కా నాగచైతన్య, సమంత కలిసే వెళుతున్నారు. మిగిలింది కేవలం అధికారికంగా ఒక్కటి కావటమే. ఆ ముహుర్తం కూడా ఖరారైనట్లు టాక్. వచ్చే ఏడాది ఆగస్టులో వీరి పెళ్లి ఉంటుందని చెబుతున్నారు. డిసెంబర్ లో అక్కినేని అఖిల్, ఆయన ప్రేమికురాలు శ్రేయ ఎంగేజ్ మెంట్ జరగనున్న విషయం తెలిసిందే. ఇది ముగిసిన తర్వాత నాగార్జున నాగచైతన్య, సమంతల పెళ్ళి పనుల్లో ఉంటారని చెబుతున్నారు. అఖిల్ వివాహం వచ్చే ఏడాది మేలో జరగనుందని సమాచారం. నాగచైతన్య, సమంతల పెళ్లి వచ్చే ఏడాది ఆగస్ట్‌ లో జరగనుందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

సమంత, చైతన్యల పెళ్లి హైదరాబాద్‌లో హిందు సంప్రదాయం ప్రకారం, ఆ తరువాత చెన్నైలో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జరగనుందని చెబుతున్నారు. సమంత చేతిలో ప్రస్తుతం మూడు చిత్రాలు ఉన్నాయి. వాటిలో విశాల్ సరసన నటించే ఇరుంబు కుదిరై, శివకార్తికేయన్ జంటగా ఒక చిత్రం, విజయ్‌సేతుపతితో మరో చిత్రం చేయనున్నారు. ప్రస్తుతం అంగీకరించిన చిత్రాలను త్వరగా పూర్తి చేసి పెళ్లికి సిద్ధం అవ్వాలన్నది సమంత ఆలోచనగా తెలుస్తోంది. పెళ్లి తర్వాత కూడా నటించే ఆప్షన్ ను నాగచైతన్య సమంతకు ఇచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరిన్ని విషయాలు చెప్పింది సమంత

ఆయనకే భాద ఎక్కువ:

ఆయనకే భాద ఎక్కువ:

పెళ్ళీ అని తెలిసిన దగ్గరినుంచీ అవకాశాలు రావటం లేదనిచెప్పింది సమంత. పెళ్ళి తర్వాత నటించటం పై నాగార్జున అభ్యంతరం చెప్పాడు అంటూ వచ్చిన వార్తల పై స్పందించిన సమంతా "నేను పెళ్లి తర్వాత నటించడం ఆపేస్తే.. ఆయనే ఎక్కువ బాధపడతారు. నేనూ నటించడం ఆపేయను. దీన్ని కొనసాగిస్తాను.

ఇతరుల గురించి నాకు తెలియదు:

ఇతరుల గురించి నాకు తెలియదు:

తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో పెళ్లైన నటీమణుల పట్ల అభద్రత ఎందుకో వివరించాలనే ఉద్దేశంతో చెబుతున్నా. ఇతరుల గురించి నాకు తెలియదు. కానీ నేను మాత్రం పెళ్లైన తర్వాత ఎక్కడికీ పోను' అని చెప్పి ఇప్పటివరకూ ఉన్న అపోహలని తొలగించే ప్రయత్నం చేసింది. అనంతరం నాగచైతన్యతో పెళ్లి గురించి మాట్లాడుతూ..

అతను నాతోనే ఉన్నాడు:

అతను నాతోనే ఉన్నాడు:

‘వచ్చే ఏడాది చివర్లో పెళ్లి చేసుకోవాలని నేను, చైతన్య నిర్ణయించుకున్నాం. అతను, అతని కుటుంబం చాలా అనుకూలంగా స్పందిస్తారు. చైతన్యతో తొలి సినిమాలో నటిస్తున్నప్పుడు అతనితో నా పెళ్లి జరుగుతుందని వూహించలేదు. నేను యూఎస్‌కు నా పర్స్‌లో కేవలం 30 డాలర్లతో వెళ్తున్నప్పుడు అతను నాతోనే ఉన్నాడు.

 ఆ ప్రయాణం:

ఆ ప్రయాణం:

ఓ మనిషిగా, నటిగా ఆ ప్రయాణం నా జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించింది. ఇప్పుడు అతన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యా. చిత్ర పరిశ్రమలో నా భవిష్యత్తు గురించి సందేహం ఉంది. అతని కుటుంబంతో నా భవిష్యత్తు గురించి సందేహం లేనందుకు సంతోషంగా ఉంది. కనీసం వాణిజ్య ప్రకటనల ఆఫర్లు కూడా తగ్గిపోయాయి.. అయినా వాటిలో నటించకూడదని అనుకున్నా' అని సమంత చెప్పింది.

హాట్ టాపిక్:

హాట్ టాపిక్:

నాగచైతన్య, సమంతా ల ఎంగేజ్ మెంట్ ఎప్పుడన్నదే ఇపుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఈ మధ్య కాలంలో ఇంత హైప్రొఫైల్ జంట ఒక్కటైన దృష్టాంతం టాలీవుడ్ లో లేదు. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు రెండింటికీ మనవడైన నాగచైతన్య తమిళ అమ్మాయి అయిన సమంతను సెలెక్ట్ చేసుకోవడం ఇండస్ట్రీని ఆహ్లాదపర్చిందనే చెప్పాలి.

 చాలా హిట్స్ కొట్టింది:

చాలా హిట్స్ కొట్టింది:

కారణం.. సమంత ప్రస్తుతం మంచి స్వింగ్ లో ఉన్న హీరోయిన్. ఓ రకంగా నెంబర్ వన్ అని చెప్పాలి. నిర్మాతలు ఆమె కాల్షీట్ల కోసం వెంపర్లాడుతున్నారు. ఆమె తో పోలిస్తే చైతూ కాస్త వెనకబడే ఉన్నాడు. అతనికి ఫుల్ లెంగ్త్ హిట్ ఇంకా లభించలేదు. కానీ సమంత చాలా హిట్స్ కొట్టింది. అంతేకాక పెర్ఫార్మెన్స్ ఓరియెంటెండ్ పాత్రలూ చేసింది. దాదాపు ప్రతీ హీరో ఆమెను హీరోయిన్ గా కోరుకుంటున్న పరిస్థితి ఉంది.

ఏం మాయ చేసావే:

ఏం మాయ చేసావే:

ఈ ఇద్దరూ కలిసి తొలిసారిగా ఏం మాయ చేసావే.. అనే హిట్ మూవీలో నటించారు. అప్పుడే పెయిర్ అయ్యారు. ఏడాదికాలంగా ఇరువురూ డేటింగ్ చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సమంతను ఎంపిక చేసుకోవడంపై నాగార్జున కూడా హ్యాపీ గానే ఉన్నట్లు సమాచారం. ఆయన, అమల ఇఫ్పటికే వారి పెళ్ళికి క్లియరెన్స్ ఇచ్చేశారు.

 పెళ్ళయ్యాక సమంత నటిస్తుందా:

పెళ్ళయ్యాక సమంత నటిస్తుందా:

ఇప్పుడిక తేలాల్సిందల్లా పెళ్ళయ్యాక సమంత నటిస్తుందా.. లేదా అన్నది. ఇండస్ట్రీ వర్గాల కథనం ప్రకారం ఆమె కొంతకాలం నటనకు దూరం కావొచ్చని. అమల నాగార్జునను పెళ్ళి చేసుకున్నాక నటనకు గుడ్ బై చెప్పేసింది. ఇంటికే పరిమితమయ్యింది. బ్లూ క్రాస్ లాంటి సంస్థతో టై అప్ అయి జంతు హక్కుల కార్యకర్తగా యాక్టివ్ గా ఉంది.

కష్టాల్లో ఉన్న వారిని ఆదుకొంటోంది:

కష్టాల్లో ఉన్న వారిని ఆదుకొంటోంది:

సమంతలో కూడా సామాజిక స్పృహ కాస్త ఎక్కువ. ఆమె ఓ స్వచ్ఛంద సంస్థ కూడా నడుపుతోంది. ఉన్నంతలో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకొంటోంది. క్రిస్టియన్ కావడంతో కొంత మిషనరీ హెల్పింగ్ నేచర్ ఉంది. విశాఖలో హుద్ హుద్ తుఫాను వచ్చినపుడు పెద్ద హీరోలతో సమానంగా ఆమె 15 లక్షల రూపాయల సాయం అందించి ఔదార్యాన్ని చాటుకుంది.

గ్యారంటీ ఏమీ లేదు:

గ్యారంటీ ఏమీ లేదు:

అలానే దాదాపు 65 మంది అనాథలకు చేయూతనందిస్తోంది. వచ్చిన డబ్బంతా తినేస్తామా ఏంటి.. అని నవ్వుతూ ఓ సారి బదులిచ్చింది. అయితే జీవితాంతం సినిమాలు చేస్తానన్న గ్యారంటీ ఏమీ లేదని, వివాహ జీవితం కూడా ముఖ్యమని కూడా చెప్పింది. అయితే ఈ లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన ప్రకారం పెళ్ళి తర్వాత సినిమాలు మానకపోవచ్చు కానీ మరీ ఇప్పుడు చేస్తున్నంత స్పీడ్గా మాత్రం ఉండకపోవచ్చు... ఇక గ్లామర్ పాత్రలైతే ఉండనట్టే అనుకోవాలి.

English summary
Samantha Confirmed she Will Continue Acting Films After Her Marriage with Hero Akkineni Naga chaithanya, in a interview
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu