»   » ప్రేమ విషయం పబ్లిగ్గా ప్రకటించిన సమంత! (ఈ మూడు సింబల్సే సాక్ష్యం)

ప్రేమ విషయం పబ్లిగ్గా ప్రకటించిన సమంత! (ఈ మూడు సింబల్సే సాక్ష్యం)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పలు సినిమాల్లో లవర్స్‌గా నటించిన నాగ చైతన్య, సమంత నిజ జీవితంలోనూ ప్రేమలో పడ్డ సంగతి తెలిసిందే. త్వరలో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇద్దరూ డేటింగ్ చేస్తూ కలిసి తిరుగుతూ చాలా సార్లు మీడియాకు దొరికి పోయారు కూడా. వీరి ప్రేమ, పెళ్లి విషయం బహిరంగ రహస్యమే. అయితే అటు నాగ చైతన్యగానీ, ఇటు సమంత గానీ ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించలేదు.

గతంలో ఓ ఇంటర్వ్యూలో సమంత ప్రేమలో పడ్డ విషయం వెల్లడించింది గానీ... నాగ చైతన్య పేరు మాత్రం బయట పెట్టలేదు. తాజా ఆమె తన ప్రేమికుడు, పెళ్లాడబోయే వ్యక్తి అతడే అని పబ్లిక్ అందరికీ తెలిసేలా చేసింది. నాగ చైతన్య నటించిన 'ప్రేమమ్' సినిమా పోస్టర్‌ను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. నాగ చైతన్యపై తన ప్రేమను అక్షరాల రూపంలో కాకండా లవ్ సింబల్స్ రూపంలో వ్యక్త పరిచింది. మూడు పురంగు లవ్ సింబల్స్ ను యాడ్ చేస్తూ ఆ పోస్టు షేర్ చేసింది. సాధారణంగా సమంత తన ట్విట్టర్లో ఇలాంటి పోస్టులు చేయదు. ఇపుడు సంథింగ్ స్పెషల్ గా ఇలా చేయడం ద్వారా అతనిపై తనకు ఉన్న ప్రేమను పబ్లిక్‌గా ప్రకటించినట్లయింది.


వీరి ప్రేమ విషయం బయటకు లీక్ అయ్యాక హైదరాబాద్ నాగ చైతన్య, సమంత కలిసి తిరుగుతూ మీడియాకు చిక్కడం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఇబ్బందిగా ఫీలైన ఈ జంట ఇటీవలే బెల్జియం వెళ్లి జాలీగా ఎంజాయ్ చేసి వచ్చారు. త్వరలో వీరి వివాహ తేదీ ఖరారు కానుంది.


నాగార్జున కూడా.... సమంత-చైతూ ప్రేమ వివాహం చేసుకోవడంపై హ్యాపీగా ఉన్నారు. ఇటీవల ఆయన స్పందిస్తూ ఇంకా పెళ్లి డేట్ ఖరారు కాలేదని, వాళ్లు ఎప్పుడు పెళ్లికి సిద్దం అయితే అప్పుడే తాను ఏర్పాట్లు చేయడానికి సిద్దమే అన్నారు. నాగ చైతన్య, అఖిల్ వివాహాలు ఒకేసారి అవుతాయనే వార్తలను నాగార్జున తోసి పుచ్చారు. ఇద్దరి వివాహాలు వేర్వేరు డేట్లలో జరుగుతాయని స్పష్టం చేసారు.


స్లైడ్ షోలో...


సమంత ట్వీట్

సమంత ట్వీట్

సమంత చేసిన ట్వీట్.. ఇక్కడ మూడు లవ్ సింబల్స్ గమనించవచ్చు.


సమంత షేర్ చేసింది ఇదే..

సమంత షేర్ చేసింది ఇదే..

సమంత తన సోషల్ మీడియా పేజీ ద్వారా షేర్ చేసిన నాగ చైతన్య పోస్టర్ ఇదే..


ప్రేమమ్

ప్రేమమ్

చైతన్య అక్కినేని, శ్రుతి హాసన్, మడొన్నా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్‌ల కాంబినేషన్‌లో, చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ‘సితార ఎంటర్‌టైన్మెంట్స్' పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమమ్'.


ముస్తాబవుతోంది

ముస్తాబవుతోంది

ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతున్న సందర్భంగా యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ 'చిత్రంలోని తొలి పాటను ఈ నెల 18న ఎఫ్ఎమ్‌లలో విడుదల చేస్తున్నామని తెలిపారు.


ఆడియో

ఆడియో

ఈ నెల 24 న ఆడియోను చిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా నిర్వహిస్తామని నిర్మాతలు తెలిపారు.


రిలీజ్ డేట్

రిలీజ్ డేట్

ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 9వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. చిత్రంలోని ఇతర తారాగణం ఈశ్వరీరావు, జీవా, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి, పృథ్వీ, నర్రా శ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, అరవిందకృష్ణ, సత్య, కార్తీక్ ప్రసాద్, నోయల్, జోగి బ్రదర్స్. ఈ చిత్రానికి సంగీతం గోపిసుందర్, రాజేష్ మురుగేషన్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, వనమాలి, శ్రీమణి, పూర్ణ, కృష్ణ మాదినేని; చాయా గ్రహణం: కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు, ఆర్ట్: సాహి సురేష్, ఒరిజినల్ స్టోరీ: ఆల్ఫోన్సె పుధరిన్. సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: చందు మొండేటి.


English summary
Samantha expressed her love with three love symbols. Naga Chaitanya today released the poster of his latest movie 'Premam' in which Chaitanya is seen in three varied get ups. Samantha re-tweeted with a quote with three love symbols. So this is kind of three cheers in a romantic way.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu