»   »  షాకిస్తున్న సమంత రౌడీ లుక్ (ఫొటో)

షాకిస్తున్న సమంత రౌడీ లుక్ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇన్నాళ్లూ సమంత క్యూట్ లుక్ తో ఫ్యామిలీ హీరోయిన్ గానే ప్రేక్షకులకు గుర్తుండి పోయింది. ఇప్పుడు రౌడీగా హాట్ లుక్ తో కనిపించి అలరించటానికి రెడీ అవుతోంది. ప్రముఖ తమిళ దర్సకుడు లింగు స్వామి దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందుతున్న చిత్రం కోసం ఆమె ఈ గెటప్ లో కనిపించింది. మీరు చూస్తున్న ఈ లుక్ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది.

రొమాంటిక్ ఎంటర్టెనర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. సింగం-2 తర్వాత లింగుస్వామి, గౌతం మీనన్ లతో కలిసి చేసే రెండు ప్రాజెక్టుల్లో సమాంతరంగా నటించనున్నట్లు గతంలో సూర్య ప్రకటించినప్పటికీ డేట్స్ అడ్జెట్స్ కాకపోవడంతో గౌతం మీనన్ దర్శకత్వంలో కమిటైన 'దృవ నచ్చిత్తిరం' సినిమాను ప్రస్తుతానికి పక్కన పెట్టాడు సూర్య. ఈ సినిమాకు హీరోయిన్ ఖరారు కావాల్సి ఉంది. సింగం-2 భారీ విజయం సాధించడంతో సూర్య తర్వాతి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొంత కాలం వరకు ప్రయోగాత్మక చిత్రాల జోలికి పోకుండా కమర్షియల్ సినిమాలను మాత్రమే చేయాలని డిసైడ్ అయ్యాడు సూర్య. ప్రస్తుతం లింగు స్వామి దర్శకత్వంలో చేయబోయే సినిమా కమర్షియల్ కోవకు చెందినదే అంటున్నారు.

Samantha look in Lingu Swamy film

తెలుగులో స్టార్ హీరోయిన్ ఎవరూ అంటే సమంత అని చెప్తారు. దాంతో ఆమె వెంట ఎప్పుడూ మీడియా ఉంటుంది. ఆమె ఏం చెప్పినా ఓ రేంజిలో కవరేజ్ ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలోనే జాగ్రత్తగా ఉండాలని,ఇంటా బయిట నటన చేయకూడదని, తనను పబ్లిక్ మాత్రమే కాక పైవాడు గమనిస్తూనే ఉంటాడని చెప్తోంది. అయినా ఎవరో సంతోషం కోసం, మరొకర్ని బాధపెట్టడం కోసం తానెప్పుడూ నటించనని, నిజ జీవితంలో నిజాయితీగా ఉండడానికి ప్రయత్నిస్తానని చెబుతోంది. మొత్తానికి నటన అనేది సెట్‌లోనే చేస్తానని, ఇంటికి వెళ్లాక సింపుల్‌గా ఉంటానని అంటుందీ అంటే పైనుంచి ఓ శక్తి తనను గమనిస్తుందన్న నమ్మకం ఉండబట్టే కదా అని శెలవిస్తోంది.

ఆమె మాట్లాడుతూ... మనం తప్పులు చేస్తే ఎవరూ చూడకపోయినా ఏదో శక్తి మాత్రం తప్పక చూస్తుందని, అందుకనే మన హద్దుల్లో మనం ఉంటేనే మంచిదని చెబుతోంది సమంత. ఒక్కసారి షూటింగ్ అయిపోయాక మేకప్ తీసేస్తే తాను సాధారణ అమ్మాయిలా మారిపోతానని, అక్కడ కూడా నటన చేయాలంటే తనకు నచ్చదని, కొంతమంది మేకప్ తీసేసాక కూడా నటిస్తూనే ఉంటారని చెబుతోంది. అటువంటివారిని మనం గమనించకపోయినా దేవుడు గమనిస్తాడని, అయినా వ్యక్తిగత జీవితంలో కూడా నటిస్తూపోతే, చివరికి నటనంటే బోర్ కొట్టదా అని అడుగుతోంది.


మరో ప్రక్క సమంత కూడా కొన్నాళ్ల వరకూ తెలుగు సినిమాలకు అందుబాటులో ఉండనని ప్రకటించింది. కారణం.. తమిళ, మలయాళ రంగాల్లో దృష్టి పెట్టడమే. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ఓ సినిమాలో నటిస్తోంది. 'మనం'లోనూ సమంతే కథానాయిక. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికీ సంతకం పెట్టింది. వీటితో పుల్‌స్టాప్‌ పెట్టేసింది సమంత. కొత్త కథలు వినడం లేదు. విన్నా ఒప్పుకోవడం లేదు. ''గత మూడేళ్లుగా తెలుగు సినిమాతో మమేకమైపోయా. నటిగా నాకు భాషా బేధం లేదు. తమిళ, మలయాళ చిత్రాలనుంచీ ఆహ్వానం అందుతోంది. త్వరలో ఓ మలయాళ చిత్రంలో నటిస్తున్నా. అందుకే తెలుగు సినిమాలకు తాత్కాలికంగా దూరం అవుతున్నా'' అంటోంది సమంత.

English summary
Samantha is a busy actress in Tollywood and has shone in Tamil filmdom too with her few performances. she has apparently decided to take a break from Telugu films. She is working on three Telugu projects as of now. And she is looking to focus on Tamil movies once the Telugu projects are completed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu