twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వామ్మో..! నిన్న ప్రభాస్ రానా, ఇవాళ సమంతా, ప్రమాదకర వ్యక్తుల జాబితాలో టాప్ అక్కినేని వారి కోడలు

    |

    ఒక్కొక్కొక్క రోజు ఒక్కొక్క తార పేరు విడుదల చేస్తూ బ్రౌజర్లని బయపెడుతోంది మెకాఫే. మూడు రోజులకిందట సల్మాన్ ఖాన్, కమేడియన్ కపిల్ శర్మ ల కోసం సెర్చ్ చేయటం వల్ల ప్రమాదకర వైరస్ల భారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించిన ఈ సైబర్ సెక్యూరిటీ సంస్థ నిన్న టాలీవుడ్ హీరోలైన ప్రభాస్, రానాలు కూడా ఈ రోజు దక్షిణాది హీరోయిన్ల పేర్లు కూడా వెల్లడించింది. ఇక కోలీవుడ్ లిస్టులో టాప్ స్థాయిలో సమంతా ఉంది. ఇక ఆమె తర్వాత మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో తాప్సీ, శివకార్తికేయన్‌, ధనుష్‌ నిలిచారు.

     సైబ‌ర్ సెక్యూరిటీ కంపెనీ మెకాఫే

    సైబ‌ర్ సెక్యూరిటీ కంపెనీ మెకాఫే

    ఇటీవల కాలంలో డిజిటల్‌ ప్రపంచం ఎక్కువగా పెరుగుతుండటంతో, అభిమానులు తమకు నచ్చిన సెలబ్రిటీ గురించి తెలుసుకోవాలంటే ఆన్‌లైన్‌నే ఆశ్రయిస్తున్నారు.ఇలా సెర్చ్‌ చేసేటప్పుడు అనుమానిత లింక్‌లను క్లిక్‌ చేయాల్సి వస్తుందని, వాటివల్ల ఏర్పడే ప్రమాదాన్ని మెకాఫీ వెల్లడించింది.

    సల్మాన్ ఖాన్

    సల్మాన్ ఖాన్

    2016 లో ఈ జాబితాలో బాలీవుడ్ తార సోనాక్షీ సిన్హా మొదటిస్థానం లో ఉండగా దక్షిణాది హీరోలు అసలు ఈ జాబితాలోనే లేరు. సోనాక్షి సిన్హాను వెనక్కి నెట్టేసి మెకాఫీ మోస్ట్‌ సెన్సేషనల్‌ సెలబ్రిటీల జాబితా 2017లో ఈ సంవత్సరం సల్మాన్ ఆ ప్రమాదకారి సెలబ్రిటీగా మారాడు.

     హానిక‌ర‌మైన వెబ్‌సైట్లు

    హానిక‌ర‌మైన వెబ్‌సైట్లు

    సెర్చ్ ఇంజ‌న్‌ల‌లో సెల‌బ్రిటీల పేరుతో సెర్చ్ చేస్తున్న‌ప్పుడు ఒక్కోసారి అత్యంత హానిక‌ర‌మైన వెబ్‌సైట్లు ఓపెన్ అవుతుంటాయి. అలా ప్ర‌భు, ప్రభాస్, రానా ల గురించి సెర్చ్ చేస్తున్న‌పుడు, సమంతా రూత్ ప్రభు అనే పేరుతో సెర్చ్ చేసినప్పుడు ఎక్కువ‌గా హానిక‌ర వెబ్‌సైట్లు ఓపెన్ అవుత‌న్నాయ‌ని ఈ సైబ‌ర్ సెక్యూరిటీ కంపెనీ మెకాఫె వెల్ల‌డించింది.

     మాల్ వేర్ సెలబ్రిటీ

    మాల్ వేర్ సెలబ్రిటీ

    మెకాఫీ మోస్ట్‌ సెన్షేషనల్‌ సెలబ్రిటీ జాబితాలో ఈ సంవత్సరానికి గానూ సమంత ఈ మాల్వేర్ సెలబ్రిటీగా నిలిచింది.. గతేడాది ఈ స్థానంలో కన్నడభామ నిక్కీ గల్రానీ నిలిచింది. హీరోయిన్‌గానే కాకుండా సామాజిక సేవకురాలిగాను, సోషల్‌ మీడియాలోను, మోడల్‌గాను పలు రంగాల్లో ప్రతిభ చాటుకుంటూ ఉన్న సమంత ఈ సంవత్సరం అక్కినేని నాగచైతన్యతో వివాహం వల్ల మరింతగా సెర్చ్ చేయటానికి కారణమైంది.

    ఈ సంవత్సరం బలి

    ఈ సంవత్సరం బలి

    దాంతో హ్యాకర్లకూ, మాల్వేర్ వైరస్ ని వ్యాప్తి చేసే వెబ్సైట్లకూ సమంతా ఈ సంవత్సరం బలి అయినట్టే... సెల‌బ్రిటీ పేర్ల మీద ఉన్న సైట్లు ఎంత వ‌ర‌కు సురక్షితం అనే విష‌యంపై మెకాఫే ప్ర‌తీ యేటా అధ్య‌య‌నం చేస్తుంది. అంటే వీళ్ల పేర్లమీద సెర్చ్ చేస్తున్నప్పుడు ఎలక్ట్రానిక్ గాడ్గెట్లమీద దాడి చేసే ప్రమాదకర వైరస్ ఉన్న వెబ్ సైట్లు ఎక్కువగా దాడి చేసే అవకాశం ఉన్నట్టే. ఇక మీరు ఆ సైట్ ని ఓపెన్ చేసారంటే ప్రమాదం లో పడ్డట్టే. కాబట్టి అభిమాన నటులూ, హీరోల గురించి సెర్చ్ ఇంజిన్లలో వెతుకుతున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే...

    English summary
    Cybersecurity firm McAfee said Tuesday that Samantha is most likely celebrity to land users on websites that carry viruses or malware.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X