For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘రాజుగారి గది 2’లో నాగార్జున అలా... సమంత ఇలా! ఇద్దరూ సోషల్ మీడియాలో మొదలు

  By Srikanya
  |

  హైదరాబాద్‌: ముందునుకున్న షెడ్యూల్ ప్రకారమే 'రాజుగారి గది 2' షెడ్యూల్ మొదలైంది. నాగార్జున, ఆయన కాబోయే కోడలు సమంత ...ఇద్దరూ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. నిజానికి అక్కినేని ఫ్యామిలీలో కొద్దిపాటి డిస్ట్ర‌బెన్సెస్ నాగార్జున‌ను ఇబ్బందికి గురిచేశాయ‌ని, అందువ‌ల్ల 'రాజుగారి గ‌ది-2' షూటింగ్‌కి అడ్డంకులు క‌లిగాయ‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది.

  ముఖ్యంగా అఖిల్ మ్యారేజ్ క్యాన్సిల్ అవ్వ‌డంతో నాగార్జున డిస్ట్ర‌బ్డ్‌ కావటం, దానికి తోడు 'ఓం న‌మో వెంక‌టేశాయ‌' ప‌రాజ‌యం మ‌రికాస్త క‌ల‌త‌కు కార‌ణ‌మైంది. అందుకే కొన్ని వారాలుగా నాగార్జున షూటింగుల్లో పాల్గొన‌డం లేద‌ని చెప్పుకున్నారు. గ‌త కొంత కాలంగా సోషల్‌మీడియాలోనూ ఆయ‌న కనపడటం లేదు. ఏదైతేనేం కింగ్ ఈజ్ బ్యాక్‌ ఆయన తిరిగి షూటింగ్ లో కి వచ్చేసారు.

  'రాజుగారి గ‌ది-2' షూటింగ్ య‌థావిధిగా జ‌రుగుతోంది. ఆన్ సెట్స్ నుంచి ఓ పిక్‌ని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన నాగ్ .. "బ్యాక్ ఈజ్ బిజినెస్ విత్ రాజుగారి గ‌ది" అంటూ క్యాప్ష‌న్‌ పెట్టారు. ఈ సింపుల్ క్యాప్ష‌న్‌తో 'నేను మ‌ళ్లీ వ‌చ్చేశా' అన్న సిగ్న‌ల్ అభిమానుల‌కు పంపించారు.

  మరో ప్రక్క హీరయిన్ సమంత సైతం తన కొత్త చిత్రం 'రాజుగారి గది 2' షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో తన లుక్‌కు సంబంధించి తొలి ఫొటోను సమంత సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. అందులో ఆమె నలుపు వర్ణం చుడిదార్‌ ధరించి అటువైపుగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ చాలా అందంగా కనిపించారు.

  పీవీపీ సినిమా పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఓంకార్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున ఎదుటివారి మానసిక స్థితిగతుల్ని అంచనా వేసే వ్యక్తి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తన లుక్‌కు సంబంధించిన తొలి ఫొటోను నాగార్జున సోమవారం ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. హారర్‌ కామెడీగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీరత్‌ కపూర్‌ ఓ

  హీరోయిన్ గా పాత్ర పోషిస్తున్నారు.

  #instalove #rajugarigadhi2 🎥 #workhigh ❤️

  A post shared by Samantha Ruth Prabhu (@samantharuthprabhuoffl) on

  అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ చిత్రంలో నాగ్‌ విల‍క్షణంగా ఉండే గెటప్‌ తో కనిపించనున్నారు. నాగ్ డ్రెస్సింగ్ నుంచి లుక్స్ వరకు అన్నీ ట్రెండీగా ఉంటాయని చెప్తున్నారు. ఓ ఫ్యాన్సీ బైక్‌ పై హల్‌చల్‌ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తాడని సమాచారం. ఇక నాగ్‌ పాత్ర విషయానికి వస్తే... ఈ సినిమాలో మెంటలిస్ట్‌గా కనిపించబోతున్నారు. అతీంద్రియ శక్తులు కలిగి.. ఎదుటి వ్యక్తి ఆలోచనలు, ప్రవర్తనతో ఓ ఆట ఆడుకుంటాడని చెప్తుున్నారు.

  ఇక ఈ చిత్రంలో సమంతా ఓ కీ రోల్‌ లో నటించనుంది. అయితే నాగార్జున, సమంతా జంటగా నటిస్తున్నారనే వార్తల్లో నిజం లేదంటున్నారు చిత్ర యూనిట్‌. వారిద్దరివి వేరు వేరు పాత్రలని, అదేవిధంగా అందరు అనుకుంటున్నట్టు సమంతా దెయ్యం గా కూడా నటించడం లేదని తేలింది. చాలా ఎమోషనల్‌ రోల్‌ లో ఆమె ప్రేక్షకులను అలరించునుందని చెప్తున్నారు.

  అంతేకాదు.. ఇంతకు ముందు రాజు గారి గదిలో హీరోగా చేసిన ఓంకార్ తమ్ముడు అశ్విన్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. సీరత్‌ కపూర్‌ ఒక హీరోయిన్‌ చేస్తోంది. పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. థమన్‌ సంగీతం అందిస్తున్నారు.

  నాగార్జున మరిన్ని విశేషాలు తెలియజేస్తూ... కామెడీ మేళవించిన హారర్ థ్రిల్లర్ చిత్రమిది. ఇప్పటివరకు ఇలాంటి కథతో సినిమా చేయలేదు. కథ వినగానే ఎక్సైట్ అయ్యాను. నా పాత్ర చిత్రణ వైవిధ్యంగా వుంటుంది అన్నారు. ఓం నమో వెంకటేశాయ షూటింగ్ చివరి రోజు చాలా బాధపడ్డాను. ఓ మంచి సినిమా చిత్రీకరణ అప్పుడే పూర్తయిపోయిందా? అనిపించింది.

  ఈ సినిమా తర్వాత ఎలాంటి సబ్జెక్ట్‌ను ఎంచుకోవాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఓంకార్ వద్ద మంచి కథ వుందని పీవీపీ, నిరంజన్ నాతో చెప్పారు. వయసైపోతుంది కాబట్టి భవిష్యత్తులో నేను లీడ్ క్యారెక్టర్స్ చేస్తానో లేదో తెలియదు. కథలో ఏదో స్పెషాలిటీ వుంటేనే నటిస్తాను అని వారితో అన్నాను. అనుకున్నట్లుగా ఈ సినిమాకు అద్భుతమైన కథ కుదిరింది అన్నారు నాగార్జున.

  ఈ సినిమాలో ఇప్పటివరకు చూడని నాగార్జునను చూస్తారని దర్శకుడు ఓంకార్ పేర్కొన్నారు. నాగార్జునగారి సూచనలతో స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేశామని, నిర్మాత పీవీపీ చెప్పారు.

  English summary
  Both Nagarjuna and his soon-to-be daughter-in-law Samantha have started shooting for 'Raju Gari Gadhi 2'.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X