»   » ఇద్దరూ కలిసే వెళ్ళారు.... సమంతా నాగచైతన్య మాల్దీవుల్లో ఇలా

ఇద్దరూ కలిసే వెళ్ళారు.... సమంతా నాగచైతన్య మాల్దీవుల్లో ఇలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని వారసుడు నాగచైతన్య మరియు టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంతలు ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. నాగార్జున ఇద్దరు కొడుకులు నాగ చైతన్య, అఖిల్ ప్రేమలో పడటం, ఇరు వైపులా పెద్దలు వారి ప్రేమను అంగీకరించడంతో వారిలో ముందుగా చిన్న వాడైన అఖిల్ వివాహ నిశ్చితార్ధ వేడుకలు ఇటీవలే అతను ప్రేమించిన ఫేషన్ డిజైనర్ శ్రీయ భూపాల్ తో జరిగాయి. ఇప్పుడు నాగ చైతన్య, సమంతాల వివాహ నిశ్చితార్ధ వేడుక జరుపడానికి ఇరు కుటుంబాలు సిద్దం అవుతున్నాయి. జనవరి ఆఖరి వారంలో ఈ కార్యక్రమం జరుపబోతున్నట్లు తాజా సమాచారం. వచ్చే ఏడాదిలోనే రెండు జంటల వివాహాలు వేర్వేరుగా జరిపించాలని భావిస్తున్నారు.

జనవరిలో వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరుగనుంది. కాగా మే లోపే వీరి పెళ్లి కూడా జరుగనుంది. కాగా సమంత ప్రస్తుతం తెలుగులో ఏ ఒక్క చిత్రంలో కూడా నటించడం లేదు. తమిళంలో ఒక్క చిత్రం మినహా సమంత చాలా ఫ్రీగా ఉంటోంది. తాజాగా ఈ అమ్మడు క్రిస్టమస్‌ మరియు న్యూఇయర్‌ వేడుకలను కలిపి జరుపుకుంటోంది. హాయిగా ఈ అమ్మడు బీచ్‌ల్లో బికినీలు వేసుకుంటూ సెలవులను బాగా ఎంజాయ్‌ చేస్తోంది. వీళ్ళిద్దరి హాలీడే ట్రిప్ పై చిన్న లుక్...

 రోజుకో ఫొటో:

రోజుకో ఫొటో:

తన హాలిడేస్‌లోని ఎంజాయ్‌ని రోజుకో ఫొటో చొప్పున సోషల్‌మీడియాలో అప్‌లోడ్‌ చేస్తున్నారు. సమంత అభిమానులు ఈ ఫొటోలను చూసి చాలా సంబంరగపడుతున్నారు. తాజాగా ఈ ప్రేమ పక్షులు మాల్దీవులకు చేరారు. అక్కడ హాయిగా ఎంజాయ్‌ చేస్తున్న వీరు తమ స్నేహితులతో ఉన్న ఫొటోను షేర్‌ చేశారు. ఆ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

చిరాకు పడ్డారు:

చిరాకు పడ్డారు:

ప్రస్తుతానికి ఇంకా ఏ సినిమా సెట్స్ పైకి రాని సమంతా, హ్యాప్పీగా హాలీడేస్ ని ఎంజాయ్ చేస్తుంది. నిన్నా, మొన్నటి వరకు చైతుతో తన సినిమా సెట్స్ పై టైం స్పెండ్ చేసిన స్యామ్, ఇప్పడు అతడితో కలిసి సముద్ర తీరాన రిలాక్స్ అయింది. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కొందరు ఆ ఫొటోలని లైట్ తీస్కుంటే మరికొందరు మాత్రం కాస్త చిరాకు పడ్డారు.

క్రిస్మస్ శుభాకాంక్షలు:

క్రిస్మస్ శుభాకాంక్షలు:

అభిమానులు, సినీ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలను సమంతా ఎంత హాట్‌గా చెప్పిందో అందరికీ తెలిసిందే. బికినీలో క్రిస్మస్ శుభాకాంక్షలను చెప్పి ఆమె ఒక రకంగా వేడి పుట్టించింది. ఆ ఫొటో చూసినోళ్లంతా నోరెళ్లబెట్టుంటారే తప్ప.. ఆమె ఎక్కడుందో ఆలోచించి ఉండరు కదా. ఇప్పుడామె హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. ఒంటరిగా మాత్రం కాదులెండి.

 వారం కిందటే:

వారం కిందటే:

తనకు కాబోయే భర్త నాగచైతన్య, ఇతర స్నేహితులతో కలిసి జాలీగా గడుపుతోంది. ఇంతకీ ఎక్కడో తెలుసా.. మాల్దీవ్స్‌లో ఉన్నారు వాళ్లు ప్రస్తుతం. అంతేకాదు.. కొత్త సంవత్సర వేడుకలను వారంతా కలిసి చేసుకోబోతున్నారు. వారం కిందటే వారు మాల్దీవులకు వెళ్లిపోయారట.

ఎంగేజ్‌మెంట్ పనుల్లో:

ఎంగేజ్‌మెంట్ పనుల్లో:

కాగా, ఇండియాకు తిరిగి వచ్చాక వారి ఎంగేజ్‌మెంట్ పనుల్లో బిజీ..బిజీ అయిపోతారేమో మరి చూడాలి. జనవరి 29న వారిద్దరి ఎంగేజ్‌మెంట్ జరుగుతుందన్న విషయం తెలిసిందే. అఖిల్ పెళ్ళి తర్వాతే తమ పెళ్ళి అనుకున్న ఈ ఇద్దరూ ఎవరూ ఊహించనంత వేగంగా పెళ్ళికి సిద్దమైపోతున్నారు.. ఆ లోపే మిగిలిన సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు...

English summary
Samantaa and Akkineni Naga chaitanya are enjoying in Maldives.., sharing some Movements with fans via Twitter
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu