అందులో సమంత నటించడం లేదు, వివరణ
హైదరాబాద్: మలయాళంలో విజయవంతమైన బెంగళూరు డేస్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇందులో సిద్దార్థ్, సమంతా కలిసి నటించబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదంటోంది సమంత. ఈ మేరకు ఆమె ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు.
సమంత సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్, బన్నీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది. శ్రీనువైట్ల-రామ్ చరణ్ ప్రాజెక్టులోనూ ఆమెనే హీరోయిన్‌గా తీసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు తమిళంలో ఓ రెండు సినిమాల్లో నటిస్తోంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అల్లు అర్జున్-త్రివిక్రమ్-సమంత కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా విషయానికొస్తే....వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ వెడ్డింగ్ ప్లానర్‌గా కనిపించనున్నారు. బన్నీ సృష్టించే పెళ్లి సందడి.. వినోదాలు పంచనుంది. ఈ చిత్రం కోసం హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా ఓ సెట్ వేశారు. కీలకభాగం చిత్రీకరణ అక్కడే జరిగింది. ఇందులో అల్లు అర్జున్ వెడ్డింగ్ ప్లానర్‌గా కనిపిస్తాడనీ, సినిమా అంతా పెళ్లి సందడి మధ్య సాగుతుందని తెలుస్తోంది. రాజేంద్రప్రసాద్, ఉపేంద్ర, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈచిత్రంలో సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, రావ్ రమేష్ నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











