»   » ‘రామయ్యా వస్తావయ్యా..’ డివైడ్ టాక్ పై సమంత...

‘రామయ్యా వస్తావయ్యా..’ డివైడ్ టాక్ పై సమంత...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : డివైడ్ టాక్ ప్రతి సినిమాకీ వస్తుంది. కానీ మనం పరిగణనలోకి తీసుకోవాల్సింది వసూళ్లనే. నాకు తెలిసి ప్రేక్షకులు ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు అంటూ
'రామయ్యా వస్తావయ్యా..' సినిమాకి డివైడ్ టాక్ విషయమై సమంత స్పందించింది.

అలాగే 'రామయ్యా వస్తావయ్యా..'ని ఎందుకు చూడాలంటే... తారక్ అద్భుతంగా నటించిన వైనం, తన లుక్స్ కోసం చూడొచ్చు. డాన్సులు, ఫైట్స్ బాగా చేశారు. ఆయన అభిమానులకు ఓ మంచి ఫీస్ట్‌లాంటిది. ఇక, ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లున్నాం. వాళ్ల కోసం కూడా చూడొచ్చు (నవ్వుతూ) అని చెప్పుకొచ్చింది.

'రామయ్యా వస్తావయ్యా' సినిమా ఒప్పుకోవడానికి కారణం చెప్తూ.... ఎన్టీఆర్, హరీష్‌శంకర్, 'దిల్' రాజు కాంబినేషన్‌లో సినిమా కాబట్టి చేయాలనుకున్నాను. కథ, పాత్ర నచ్చాయి. ఈ కారణాల వల్లే ఒప్పుకున్నాను. పెద్ద బడ్జెట్ మూవీ, పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో చేయాలనే సంకల్పంతో కూడా ఈ సినిమా అంగీకరించాను అని అంది.


ఈ మధ్య కాలంలో ఏదైనా సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిందంటే దాన్ని ట్రిమ్ చేసి వదులుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ చిత్రం 'రామయ్యా వస్తావయ్యా' మొన్న శుక్రవారం భారీగా విడుదల అయిన సంగతి తెలిసిందే. మార్నింగ్ షో కే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ కూడా డ్రాప్ అయిపోయాయి. ఫస్టాప్ కామెడీ బాగున్నా..సెకండాప్ లో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగోలేదనే టాక్ వచ్చింది. దాంతో పది నిముషాల వరకూ సెకండాఫ్ ట్రిమ్ చేయనునట్లు తెలుస్తోంది. దాంతో ఈ సినిమా పికప్ అవుతుందని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

English summary
Samantha says that Ramayya Vasthavayya gets good collections. NTR who tasted success this summer with Baadshah is hoping to deliver a big hit with this film. Although the film took great openings on the first day, it is very important to make sure it gets sustained collections in the first week. As these days, first week collections have become very crucial.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu