»   » సమంత నిశ్చితార్దం చీర అసలు కథేంటి, ఎవరు డిజైన్ చేసారు,ఎంత రేటు

సమంత నిశ్చితార్దం చీర అసలు కథేంటి, ఎవరు డిజైన్ చేసారు,ఎంత రేటు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :హీరోయిన్ సమంత ఆదివారం రాత్రి జరిగిన తన నిశ్చితార్థం వేడుకలో బంగారు వర్ణం అంచు కలిగిన తెలుపు చీరలో మెరిసిపోయిన సంగతి తెలిసిందే. ముంబయికి చెందిన డిజైనర్‌ క్రేషా బజాజ్‌ డిజైన్‌ చేసిన ఈ చీరలో సమంత మరింత అందంగా అద్బుతంగా ఉందంటూ అన్ని చోట్ల నుంచి, సమంతకే కాక, ఆమె కట్టుకున్న చీరకీ ప్రశంసలు వస్తున్నాయి.

ప్రియుడు అక్కినేని నాగచైతన్య తన జీవితంలోకి వస్తున్న సందర్భంగా ఆయనతో కలిసి సమంత దిగిన ఫొటోలు ఆన్‌లైన్‌లో ఆకట్టుకుంటున్నాయి. చై, సామ్‌ జంట చూడచక్కగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో అసలు ఈ చీరను డిజైన్ చేసే ఆలోచన ఎలా వచ్చింది..ఏమిది ఈ చీర డిజైనింగ్ నేపధ్యం చూద్దాం.

From the pages of my story .. to you with love ❤️

A video posted by Samantha Ruth Prabhu (@samantharuthprabhuoffl) on Jan 25, 2017 at 7:22pm PST

ఏడాది క్రితమే..

ఏడాది క్రితమే..

ప‌్రతికల్లో, టీవీల్లో ఎక్కడ చూసినా సమంత నిశ్చితార్థం చీర గురించే చెప్పుకుంటున్నారు. ఆమె ప్రేమకథని, చిత్రాలుగా చీరపై పొందిగ్గా పరిచి.. అందంగా డిజైను చేసింది ఎవరో తెలుసా ముంబయికి చెందిన డిజైనర్‌ క్రేషా బజాబ్‌. అసలీ ట్రెండ్‌కి ఏడాది క్రితమే క్రేషా తెరతీసింది.

ఆ విషయం తెలిసే..

ఆ విషయం తెలిసే..

క్రేషా బజాబ్ తన వివాహం సందర్భంగా ప్రత్యేక లెహెంగా రూపొందించుకోవాలనుకుంది. ఆ సమయంలోనే ఆమెకి అమెరికాకు చెందిన వ్యాపార ప్రముఖురాలు, చిన్నితెర నటి అడ్రియన్‌ మలూఫ్‌ భర్త చివరి జ్ఞాపకార్థంగా వాళ్ల పెళ్లి దుస్తుల్ని ఫ్రేమ్‌ చేయించి పెట్టుకుందని తెలిసింది.

పలు సంఘటనలను..

పలు సంఘటనలను..

తన పెళ్లి దుస్తుల్ని కూడా అలాగే ప్రత్యేకంగా జీవితాంతం దాచి పెట్టుకోవాలనుకుంది క్రేషా. ఆమె తన భర్త వనరాజ్‌ పరిచయం నాటి నుంచి పెళ్లి వరకూ జరిగిన పలు సంఘటనల్నీ, సందర్భాలనీ, చిత్రాలనీ సీక్వెన్లూ, పసిడి పూసలూ, ఎంబ్రాయిడరీ ద్వారా చీరపై గుదిగుచ్చింది.

ఎన్ని రోజులు సమయం..

ఎన్ని రోజులు సమయం..

ఇందుకోసం దాదాపు పదిలక్షల
రూపాయలు ఖర్చుపెట్టింది. నెలపాటు.. వంద మంది ఈ లెహెంగాను డిజైన్‌ చేశారు. అలా తన పెళ్లితో సంచలనం సృష్టించిన క్రేషా గతేడాది నుంచి ఇప్పటివరకూ ఎంతో మంది పెళ్లికూతుళ్లకు ఈ తరహా దుస్తులను రూపొందించింది. వీటి ధర మూడున్నర లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయల వరకూ ఉంటుంది.

ఇదో బ్రాండ్ అయ్యింది

ఇదో బ్రాండ్ అయ్యింది

క్రేషా వ్యాపార కుటుంబానికి చెందిన అమ్మాయి. విదేశాల్లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులు చదివి.. ముంబయిలో ప్రత్యేకంగా ఓ బ్రాండ్‌ను ప్రారంభించింది. దాని ద్వారా పెళ్లికూతుళ్లకు ప్రత్యేకంగా దుస్తుల్ని డిజైన్‌ చేయడమే కాదు.. 233 దేశాలకూ వాటిని పంపుతోంది. అలా క్రేషా తాజాగా సమంత నిశ్చితార్థం చీరని డిజైను చేసి తెలుగురాష్ట్రాల్లోనూ తనదైన ముద్ర వేస్తోంది.

అఖిల్ నిశ్చితార్దానికి చెందినివి

అఖిల్ నిశ్చితార్దానికి చెందినివి

సమంత చీర ఆమె ప్రేమకథను, చైతూపై ఆమెకున్న ప్రేమను తెలుపుతోంది. సమంత చీర అంచును బాగా గమనిస్తే.. అందులో ‘ఏమాయ చేసావె' చిత్రంలోని ఓ సన్నివేశం నుంచిమొన్నమొన్న జరిగిన అఖిల్‌ నిశ్చితార్థంలో దిగిన ఫ్యామిలీ ఫొటో వరకు దృశ్యాలు కనిపిస్తాయి.

ఇదే హాట్ టాపిక్

ఇదే హాట్ టాపిక్

బైక్‌పై సమంత, చైతన్య కలిసి ఉన్న చిత్రం కూడా కనిపిస్తుంది. ఇటీవల సమంత తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన వీడియో ఈ చీరను డిజైన్‌ చేస్తుండగా తీసినట్లుగా తెలుస్తోంది. ఈ వీడియోని మీరు పైన చూడవచ్చు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఘనంగా వేడుక

ఘనంగా వేడుక

అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య, టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ సమంత నిశ్చితార్థం హైదరాబాద్‌ ఎన్‌కన్వెన్షన్‌ సెంటర్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో ప్రముఖులు హాజరయ్యారు. అతిథుల సమక్షంలో ఈ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.

పెద్దల అంగీకారంతోనే..

పెద్దల అంగీకారంతోనే..

‘మా అమ్మ నాకూతురైంది' అంటూ నిశ్చితార్థ వేడక ఫోటోలను నాగార్జున ట్విటర్‌లో పోస్టు చేశారు. నాగచైతన్య, సమంత గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. వీరి వివాహానికి ఇరు వైపులా పెద్దలు అంగీకరించడంతో నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.

ప్రత్యేకంగాచెప్పుకోవాల్సిన విషయం

ప్రత్యేకంగాచెప్పుకోవాల్సిన విషయం

‘ఏ మాయ చేసావే' సినిమాతో వెండితెరను పంచుకున్న నాగచైతన్య, సమంత ఇప్పుడు జీవితాన్ని పంచుకోనున్నారు.అయితే.. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. వీళ్లిద్దరూ వేర్వేరు మతాలకు చెందిన వారు కావటంతో రెండు నిశ్చితార్దాలు చేసారు. హిందూ, క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఈ నిశ్చితార్దం జరిగింది.

ఆ పాత్రలే..

ఆ పాత్రలే..

నాగచైతన్య, సమంత నిశ్చితార్థ వేడుక కోసం చేసిన అలంకరణ ‘ఏమాయ చేసావె' చిత్రంలోని క్లైమాక్స్ సీన్ ని, వారిద్దరూ ఆ చిత్రంలోని కార్తీక్‌, జెస్సీ పాత్రల్ని గుర్తుకు తెప్పించడం విశేషం.

English summary
Naga Chaitanya and Samantha happened on Sunday night.Samantha looked dazzling in a white embroidered saree which caught everyone’s attention. It has a story to reveal that Sam specially designed it with the help of her close friends.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu