»   » బోర్ కొట్టేసింది..అందుకే సమంత యూటర్న్, చైతూ ఏమంటాడో

బోర్ కొట్టేసింది..అందుకే సమంత యూటర్న్, చైతూ ఏమంటాడో

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు: కన్నడ చిత్రం 'యూ టర్న్' రీమేక్ లో నటించడానికి సమంత ఆసక్తినిని కనబరిచిన విషయం తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్ లో రూపొందిన ఈ చిత్ర రీమేక్ లో నటించడానికి సమంత ఆసక్తిని కనబరిచింది. అయితే నాగచైతన్యతో వివాహం, ఎంగేజ్ మెంట్ ఈ పనుల్లో పడి ఈ ప్రాజెక్టుని ప్రక్కన పెట్టడమో లేక కాస్త టైమ్ తీసుకుంటుందనో అంతా భావించారు. కానీ సమంత...దేని గొడవ దానిదే, కెరీర్ పని కెరీర్ దే, పర్శనల్ లైఫ్ వ్యవహారాలు పర్శనలే అన్నట్లుగా ముందుకు వెళ్తోంది.

ప్రస్తుతం క్రైమ్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం రీమేక్‌కు సంబంధించి చిత్ర దర్శకుడు పవన్‌కుమార్ బెంగళూరులో చర్చలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం రీమేక్ త్వరలో ప్రారంభం కానుంది. ఒరిజినల్ వెర్షన్‌కు దర్శకత్వం వహించిన పవన్‌కుమారే రీమేక్‌కు కూడా దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం సమంత రెండు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. త్వరలోనే పెళ్లిచేసుకునేందుకు రెడీ అవుతోంది.

Samantha's next is U Turn Remake

వరుసగా ప్రేమకథా చిత్రాల్లో నటించడం వల్ల ఆ తరహా చిత్రాల్లో నటించాలంటే బోర్ కొడుతోంది. అందుకే ఇకపై నా పంథా మార్చుకోవాలనుకుంటున్నాను అంటోంది సమంతా. ఇటీవల ఆమె నితిన్‌తో కలిసి నటించిన అ..ఆ సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా తమిళ మీడియాతో సమంత మాట్లాడుతూ ప్రేమకథా చిత్రాల్లో నటించి బోర్ కొడుతోంది. ప్రేక్షకులు కూడా నాలాగే బోర్ ఫీలవుతున్నట్టున్నారు.

అందుకే రెగ్యులర్ పంథాకు భిన్నంగా వారిని సంతృప్తిపరిచే నటనకు ఆస్కారమున్న పాత్రల్లో నటించాలన్న నిర్ణయానికి వచ్చాను. అందులో భాగంగానే హీరో లేని ఓ కన్నడ రీమేక్‌లో నటించడానికి గ్రీన్‌సిగ్నలిచ్చాను. త్వరలో హారర్ నేపథ్యంలో తెరకెక్కే కథాబలమున్న సినిమాలో నటించాలనుకుంటున్నాను. నాకు నచ్చిన హారర్ కథ లభిస్తే అందులో నటించడానికి సంకోచించను. అలాంటి సినిమా ఈ ఏడాది చేసే అవకాశం కనిపిస్తోంది అని తెలిపింది.

మరో ప్రక్క షూటింగ్‌ల కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు హోటల్స్‌లోనే బస చేస్తున్నాను. ఇది నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటోంది. త్వరలో హైదరాబద్‌లో సొంత ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను. ఇందు కోసం ఇప్పటికే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టాను. త్వరలోనే సొంత ఇంటి కలని నిజం చేసుకుంటాను అని తెలిపింది సమంత.

    English summary
    Samantha will very soon commence the work on the remake of Kannada film U Turn. This movie will be directed by Pawan Kumar who had directed the Kannada version. U-Turn is a crime Thriller.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu