»   » ‘ఎర్రగులాబీలు’ గా మారిపోతున్న సమంత, సమీరా రెడ్డి

‘ఎర్రగులాబీలు’ గా మారిపోతున్న సమంత, సమీరా రెడ్డి

Posted By:
Subscribe to Filmibeat Telugu

భారతీ రాజా దర్శకత్వంలో 70వ దశకంలో వచ్చిన ఉత్తమ చిత్రాల్లో 'ఎర్రగులాబీలు" ఒకటి. ఈ థ్రిల్లర్ చిత్రంలో కమల్‌ హాసన్, శ్రీదేవి ముఖ్య పాత్రలు పోషించిన విషయం విదితమే. తాజాగా ఇదే టైటిల్ ‌తో గౌతమ్ వాసుదేవమీనన్ (ఏ మాయ చేసావె ఫేం) ఓ థ్రిల్లర్ తరహా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సమంత, సమీరారెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అశోక్ వల్లభనేని నిర్మిస్తున్న ఈ చిత్రంలో పాటలుండవు. తెలుగు, తమిళంలో ఈ చిత్రం రూపొందుతున్నా తెలుగుకు మాత్రమే ఈ 'ఎర్ర గులాబీలు" టైటిల్‌ని ఉపయోగిస్తున్నారు. మనోజ్ పరమహంస దీనికి కెమెరా వర్క్‌ని అందిస్తున్నారు. ఈ సందర్బంగా దర్శకుడు గౌతమ్ మీనన్ మాట్లాడుతూ...ఇది ఓ సైక్లాజికల్ ధ్రిల్లర్. సినిమా మొత్తం ఒక రాత్రిలో జరుగుతుంది. అందుకే షూటింగ్ రాత్రి పూటే తీసాము. టెక్నికల్ గా బాగా కష్టపడి చేసాము అన్నారు. ఇది ఓ ప్రయోగాత్మక చిత్రం అన్నారు. ఈ చిత్రం ప్రోమోస్ విడుదల హైదరాబాద్ లో తాజ్ బంజారాలో జరిగింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X