»   » సమంతా కర్ర సాము వెనుక రహస్యం.... ఆ సినిమా అంత గొప్పదా??

సమంతా కర్ర సాము వెనుక రహస్యం.... ఆ సినిమా అంత గొప్పదా??

Posted By:
Subscribe to Filmibeat Telugu

సమంతా 'కర్ర సాము' నేర్చుకుంటోంది. అందుకు సంబంధించిన వీడియోను ఆమె పోస్ట్ చేసింది. అక్కినేని ఇంట కోడ‌లిగా అడుగు పెడుతోన్న చెన్నై చిన్న‌ది స‌మంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో తెలిసిందే. రకరకాల విన్యాసాలు, మంచి మెసేజ్‌లతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది.

కర్రసాము

కర్రసాము

ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న స‌మంత వ‌చ్చే ఆగ‌స్టు క‌ల్లా ఫ్రీ అయిపోనుంది. తాజాగా మరో వీడియోనూ పోస్ట్ చేసింది సామ్ బేబి. గిర..గిరా కర్ర తిప్పుతూ కర్ర సాము చేసింది సమంత. ఎంతో నైపుణ్యం కలిగిన వ్యక్తిలా ఆమె చేసి కర్రసామును చూస్తే కాస్తంత షాకవ్వాల్సిందే. ఆ వీడియోను తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది సమంత..

కారణమేమిటో తెలిసింది

కారణమేమిటో తెలిసింది

ప్రస్తుతం సమంతా తెలుగు .. తమిళ సినిమాలను వరుసగా చేస్తోంది. అందులో ఏ సినిమా కోసం ఈ కర్ర సాము ప్రాక్టీస్ అన్నది అర్థం కాలేదెవ్వరికీ. అయినా సమంతా గిరా..గిరా కర్ర తిప్పేస్తూంటే కళ్ళప్పగించేసి చూసారంతా. అయితే తాజాగా అందుకు కారణమేమిటో తెలిసింది.

శివకార్తికేయన్ సరసన

శివకార్తికేయన్ సరసన

వివరాల్లోకి వెళితే...ప్రస్తుతం సమంత తమిళంలో శివకార్తికేయన్ సరసన ఓ చిత్రంలో నటిస్తున్నది. పోణ్ణ్ రామ్ దర్శకుడు. గ్రామీణ నేపథ్య ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కథానుగుణంగా సమంత కర్రసాము చేయాల్సివస్తుందట. దాంతో గత పది నెలలుగా కర్రసాములో సమంత ప్రత్యేక శిక్షణ తీసుకుంది.

తన కెరీర్‌లో ఇదొక ప్రత్యేక చిత్రం

చక్కటి అంకితభావంతో సమంత కర్రసాము శిక్షణను పూర్తిచేసుకుందని, వృత్తిపట్ల ఆమెకున్న నిబద్దతకు ఇది నిదర్శనమని చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా అభినందనలు తెలిపింది. సవాళ్లతో కూడుకున్న పాత్రలు చేయడానికి తానెప్పుడూ ముందుటానని, తన కెరీర్‌లో ఇదొక ప్రత్యేక చిత్రమవుతుందని సమంత ఆనందం వ్యక్తం చేసింది.

    English summary
    While many wondered what made Samantha take up the sport SILAMBAM all of a sudden, it is now known that it is indeed for her upcoming film with Sivakarthikeyan, directed by Ponram.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu