»   »  పవన్ బాటలోనే సమంత, సింగర్ స్మిత కూడా! (ఫోటోలు)

పవన్ బాటలోనే సమంత, సింగర్ స్మిత కూడా! (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అక్కినేని నాగార్జున, నటుడు శివాజీ, మంచు లక్ష్మి....ఇలా ఎంతో మంది సినిమా ప్రముఖులు నరేంద్ర మోడీ ప్రధాని కావాలనే తమ మనసులోని మాటను బయట పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో హీరోయిన్ సమంత కూడా చేరి పోయారు.

ఓ టీవీ ఛానల్‌తో హీరోయిన్ సమంత మాట్లాడుతూ.....నరేంద్ర మోడీ లాంటి వారి నాయకత్వం దేశానికి అవసరమని వ్యాఖ్యానించారు. తన సపోర్టు నరేంద్రమోడీకే అని ఆమె తేల్చి చెప్పారు. తెలుగు పాప్ సింగర్ స్మిత కూడా నరేంద్ర మోడీకి మద్దతు ఇస్తున్నారు. నరేంద్ర మోడీకి మద్దతుగా ఓ పాటల ఆల్బమ్ విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటోంది స్మిత.

స్లైడ్ షోలో ఫోటోలు, మరిన్ని వివరాలు...

సమంత

సమంత

హీరోయిన్ సమంత ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తన మద్దతు మోడీకే, ఆయన ప్రధాని అయితేనే బాగుంటుందని తెలిపారు.

స్మిత

స్మిత

మోడీ కోసం స్మిత ఆల్బం తెలుగు పాప్ సింగర్ స్మిత నరేంద్ర మోడీకి మద్దతుగా ఆల్బం విడుదల చేయబోతున్నారు. ‘వేక్ అప్ ఇండియా' పేరుతో ఈ పాత్ర ఉంటుందని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

‘జనసేన' పార్టీని స్థాపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీకి తన మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.

బీజేపీలో చేరిన శివాజీ

బీజేపీలో చేరిన శివాజీ


నటుడు శివాజీ ఇటీవల నరేంద్రమోడీకి మద్దతు పలుకుతూ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

తెలుగు నటి మంచు లక్ష్మి కూడా

తెలుగు నటి మంచు లక్ష్మి కూడా


తెలుగు నటి మంచు లక్ష్మి బీజేపీ పార్టీలో చేరక పోయినా.....మోడీ ప్రధాని అయితే బాగుంటుందని వ్యాఖ్యానించారు.

English summary
After Pawan Kalyan, Nagarjuna, Lakshmi Manchu and Shivaji, It's the turn Samantha and Smitha to extend their support to Narendra Modi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu