»   » సమంత డాక్యుమెంటరీ..!? సినిమాలు చేస్తూనే ఈ ప్రయత్నం కూడా

సమంత డాక్యుమెంటరీ..!? సినిమాలు చేస్తూనే ఈ ప్రయత్నం కూడా

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలంగాణ ప్రభుత్వం తరపున బ్రాండ్ అంబాసిడర్‌గా చేనేత రంగాన్ని అభివృద్ధిపథంలో తీసుకెళ్లేందుకు తన వంతు కృషిచేస్తోన్న సమంత తన ప్రయత్నాన్ని మరో అడుగు ముందుకు తీసుకువెళ్లారు. తెలంగాణలో చేనేత కార్మికుల బతుకు చిత్రాన్ని ప్రతిబింభించేలా దూలం సత్యనారాయణ అనే యంగ్ ఫిలింమేకర్ తెరకెక్కిస్తున్న ఓ డాక్యుమెంటరీలో సమంత కూడా ఓ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

ఏ మాయ చేశావే సినిమాతో కుర్రకారు మనస్సును దోచుకున్న ఈ బ్యూటీ కొద్దీ కాలానికే నాగ చైతన్య కు ఫిదా అయిపొయింది. అక్కినేని కుటుంబంలో కొడలిగా స్థానం సంపాదించుకోబోతున్న సమంత ప్రస్తుతం బిజీ షెడ్యూల్ తో ఉంది. రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన లో తెరకెక్కుతున్న "రంగ స్థలం 1985" తో పాటు - సావిత్రి బయోపిక్ మరియు షూటింగ్ లలో సమంత గ్యాప్ వర్క్ చేస్తోంది.

Samantha To Star In A Documentary

ఇంత బిజీ షెడ్యూల్ లో ఉండి కూడా సమంత సమయం దొరికితే.. ప్రచారాల్లో చేనేత వస్త్రాల కు బాగానే ప్రచారాన్ని చేస్తూ.. దేశ విదేశాల్లో కూడా ఈ అమ్మడు వాటి విలువలను తెలియస్తోందట. అంతే కాకుండా ఇంతవరకు ఎవరు చేయని ఓ కొత్త తరహాలో చేనేత కార్మికుల బ్రతుకును వారి కష్టాలను ఒక డాక్యుమెంటరీ ద్వారా ప్రజలకు తెలియజేయనుందని తెలుస్తోంది.

డాక్యుమెంటరీ రిలీజైతే కానీ అందులో సమంత పోషించిన పాత్ర ఏంటనే తెలిసే వీలు లేదు. సత్యనారాయణ డాక్యుమెంటరీ లను తీయడంలో మంచి అవగాహన ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ డాక్యుమెంటరీ రెడీ చేయనున్నారని సమాచారం. మరి ఆ డాక్యుమెంటరీలో సమంత ఏ విధమైన పాత్ర చేస్తుందా అని ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. చూడాలి మరి సమంత ఎంత వరకు ఈ ప్రయోగాన్ని సక్సెస్ చేస్తుందో!! ఏదేమైతేనేం... తాను బ్రాండ్ అంబాసిడర్‌గా తన చేతనైనంతమేరకు కృషి చేయాలని మాత్రం ప్రయత్నిస్తోంది. అందుకు ఆమెని అభినందించొచ్చు అంటున్నారు సమంత ఫ్యాన్స్.

English summary
The latest news is that Samantha is going to be part of a documentary that will focus on the lives of handloom weavers in Telangana.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu