‘అత్తారింటికి దారేది’ పైరసీపై సమంత ట్వీట్

By Bojja Kumar

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదలకు ముందే బయటకు లీకైంది. 90 నిమిషాల నిడివిగల సీడీలు విజయవాడలో దర్శనం ఇచ్చాయి. దాదాపు సగానికిపైగా సినిమా బయటకు ఎలా లీకైందో ఎవరికీ అర్థం కావడం లేదు.

ఈ నేపథ్యంలో ఈచిత్రంలో మెయిన్ హీరోయిన్‌గా నటించిన సమంత....ట్విట్టర్ ద్వారా తెలుగు సినీ అభిమానులకు పలు విన్నపాలు చేసింది. 'సినిమాను ఎంతో కష్టపడి చేసాం, ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు నిర్మాతలు. ఒక మంచి సినిమా ఇలా విడుదలకు ముందు పైరసీ కావడం బాధ కలిగించింది. సినిమాకు మద్దతుగా నిలవండి, పైరసీని అరికట్టండి, సినిమాను విజయవంతం చేయండి' అంటూ ట్విట్టర్ ద్వారా విన్నవించింది. ఆమె ట్వీట్స్ ఇక్కడ చూడొచ్చు.

అత్తారింటికి దారేది పైరసీ సీడీల విషయం బయటకు తెలియగానే యాంటీ పైరసీ విభాగం అప్రమత్తమైంది. ఆ సీడీలు స్ర్పెడ్ కాకుండా తగిన చర్యలు తీసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. మీకు ఎక్కడైనా అత్తారింటికి దారేది పైరసీ సీడీలుగానీ, ఇంటర్నెట్లో అలాంటి లింక్స్ గానీ కనిపిస్తే[email protected]‌ కు ఈమెయిల్ చేయండి.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. ఈచిత్రంలో నదియా పవన్ కళ్యాణ్ అత్త పాత్రలో నటించారు. కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X