»   » సమంతను బాగా భయపెట్టిన ట్రైలర్ ఇదే (వీడియో)

సమంతను బాగా భయపెట్టిన ట్రైలర్ ఇదే (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: శ్రీరామ్‌, రాయ్‌ లక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'శివ గంగ' చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. రాయ్‌ లక్ష్మీ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఈ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

వి.సి. వడి ఉడయాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శివనాథ్‌, మారెడ్డి శ్రీనివాసరెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జాన్‌ పీటర్‌ సంగీతం సమకూర్చారు. వచ్చే నెలలో తెలుగు, తమిళం భాషల్లో 'శివ గంగ' ప్రేక్షకుల ముందుకు రానుంది.

Samantha tweet about Siva Ganga Trailer

ఈ ట్రైలర్ ని మెచ్చుకుంటూ సమంత ట్వీట్ చేసింది. ఆడియో పంక్షన్ లో ఆమె స్టన్నింగ్ లుక్ తో ఫ్యాషన్ ఐకాన్ లా ఉందని, ట్రైలర్ చాలా భయపెట్టిందని చెప్పుకొస్తూ ట్వీట్ చేసింది.

శ్రీరామ్‌, రాయ్‌ లక్ష్మీ జంటగా నటించిన 'శివగంగ' చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం రాత్రి ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ఆడియోను ఆవిష్కరించారు.

    English summary
    Samantha tweeted: "iamlakshmirai Stunning At #ShivGanga Audio Launch You Looking Like A Fashion Icon And Trailer Looks Was Very Scary......."
    Please Wait while comments are loading...
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu