»   » బ్రహ్మానందం ఫోటో తీసి సమంత అల్లరి(ఫోటో)

బ్రహ్మానందం ఫోటో తీసి సమంత అల్లరి(ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సెట్ లో ఎప్పుడూ అల్లరి అల్లరిగా ఉండే సమంత తాజాగా బ్రహ్మానందం ని ఆడుకోవటం మొదలెట్టింది. ఆయన పడుకుని ఉన్న ఫోటో ని తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. మీరు చూస్తున్న ఫోటోని పోస్ట్ చేసి...దాని క్రింద..." మెలకువగా ఉన్న బ్రహ్మానందం కన్నా క్యూట్ గా ఏముంటుందో తెలుసా...నిద్రపోతూ ఉన్న బ్రహ్మానందం..హ..హ..క్యూటీ" అని ట్వీట్ చేసింది. ఈ ఫోటో వినాయిక్ షూటింగ్ సమయంలోది. ఈ చిత్రంలో బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది.

బెల్లంకొండ సురేష్ హీరోగా చేస్తున్న ఈ చిత్రానికి 'అల్లుడు శీను ' అనే టైటిల్ ని ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇలాంటి టైటిల్ కొత్త జనరేషన్ హీరోకి పెట్టబోవటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే నేటివిటికి దగ్గరగా ఉంటుందని ఈ టైటిల్ పెట్టబోతున్నట్లు యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్స్ ని అందరనీ ఈ చిత్రం కోసం ఆయన సమకూర్చారు.

Samantha tweeted about Brahmanandam

వివి వినాయిక్ మాట్లాడుతూ... నేను బెల్లంకొండ సురేష్ కుమారుడుని లాంచ్ చేయటానికి కమిటయ్యాను. ఎందుకంటే ఆయన నా మొదటి నిర్మాత. ఆది సినిమాతో నాకు కెరీర్ ఇచ్చిన వ్యత్తి. అందుకో ఆయన కుమారుడు చిత్రాన్ని నేను మంచి స్క్రిప్టుతో చేయాలనుకుంటున్నాను. అందుకోసం చాలా కథలు విన్నాను...కానీ నన్ను ఏదీ తృప్తి పరచలేదు. నాకు నచ్చింది బెల్లంకొండ కు నచ్చలేదు. అయితే ఫైనల్ గా ఓ లైన్ ని ఓకే చేసుకున్నాం. దాంతో ముందుకు వెళ్తున్నాం అన్నారు.

బెల్లంకొండ సురేశ్ స్వయంగా నిర్మించే ఈ చిత్రంలో శ్రీనివాస్ సరసన స్టార్ హీరోయిన్స్ ల్లో ఒకరైన సమంత నటిస్తుండటం విశేషం.కొంత కాలం క్రితం రెండు నెలల పాటు తను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు సురేశ్ అండగా నిలిచి ఆదుకున్నారనీ, ఆ కృతజ్ఞతతో శ్రీనివాస్ సరసన చేస్తున్నాననీ ఇప్పటికే సమంత తెలిపింది. కొంతకాలంగా శ్రీనివాస్ నటన, డాన్స్, ఫైట్స్ వంటి విభాగాల్లో చక్కని శిక్షణ తీసుకుంటూ వచ్చాడు.

ఈ చిత్రం భారీగా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనుందని తెలుస్తోంది. వివి వినాయిక్ తొలిసారిగా ఓ కొత్త హీరోతో పనిచేయబోతున్నారు. బెల్లంకొండ సురేష్ తో తనకు ఉన్న అనుభందంతోనే ఈ ప్రాజెక్టు ఓకే చేసినట్లు సమాచారం. నాయక్ చిత్రం తర్వాత వినాయిక్ చేస్తున్న చిత్రం ఇదే. వినాయిక్ మొదటి చిత్రం ఆది కి నిర్మాత బెల్లంకొండ సురేష్ బ్యానర్ మీదే చేయటంతో ఆ అనుబంధం ఇలా కొనసాగుతోంది.

English summary

 Samantha tweeted this photo and write..."What's more cuter than Brahmanandam awake?... Brahmanandam sleeping.. ha ha cutie"
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu