Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Samantha పిల్లల్ని కనాలనుకుంది.. ఆ కండీషన్ తోనే అలా.. సంచలన నిజాలు బయటపెట్టిన నీలిమ గుణ!
అక్కినేని నాగచైతన్య సమంత ల విడాకుల వ్యవహారం ఇంకా సద్దుమణగలేదు. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట కొన్ని కారణాలతో దూరమైన సంగతి తెలిసిందే. విడాకులు తీసుకోకుండా ముందే వీరిద్దరు విడిపోతున్నారు అనే ప్రచారం త్వరగా తర్వాత వారు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయం మీద సమంత టార్గెట్ చేస్తూ ప్రచారం జరుగుతుండటంతో ఆమె ఎట్టకేలకు ఈ విషయం మీద స్పందించింది కూడా. అయితే ఈ విషయం మీద తాజాగా గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆ వివరాల్లోకి వెళితే

ఇంకా సద్దుమణగని వ్యవహారం
నిజానికి విడాకుల విషయంలో సమంత నాగ చైతన్య తీసుకున్న నిర్ణయం అందరిని షాక్ కి గురి చేసింది. వారిద్దరు విడిపోతున్నట్లు ప్రకటించిన వెంటనే ఆయన అభిమానులతో పాటు ఇటు సమంత అభిమానులకు సైతం షాక్ కి గురయ్యారు. సమంత విడాకుల ప్రకటన తర్వాత ఇప్పటికీ దాని గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ విషయం మీద దర్శకుడు గుణశేఖర్ కుమార్తె శాకుంతలం నిర్మాత నీలిమ గుణ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

నోరు విప్పిన సమంత
అయితే సమంత పిల్లల్ని కనాలని అనుకోవడం లేదు అంటూ జరుగుతున్న ప్రచారం మీద సమంత తాజాగా సోషల్ మీడియా వేదికగా ఘాటుగానే స్పందించారు.. ఇప్పుడు ఇదే విషయం మీద శాకుంతలం నిర్మాత, దర్శకుడు గుణశేఖర్ కుమార్తె నీలిమ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ కొన్ని వివరాలు వెల్లడించింది.

ధృవీకరించిన గుణ
శాకుంతలము నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ సమంత తన గర్భధారణ ప్లాన్ చేస్తున్నారని నిర్ధారించింది. "గత సంవత్సరం, నా తండ్రి, దర్శకుడు గుణశేఖర్ గారితో నేను శాకుంతలం కోసం సమంతను సంప్రదించినప్పుడు, ఆమె నాన్న చెప్పిన కథను బాగా ఇష్టపడింది. ఆ సినిమా చేయాలని చాలా ఉత్సాహంగా ఉంది, కానీ ఆమె ఆ పాత్రను అంగీకరిస్తే, మాగ్జిమం సినిమా షూటింగ్ జూలై నాటికి పూర్తి చేయాలని ఆమె మాకు షరతులు విధించిందని పేర్కొంది.

పిల్లలే ముఖ్యం అంది
ఆమె ఫ్యామిలీ ప్లానింగ్ లో ఉన్నానని మాకు చెప్పిందని నీలిమ పేర్కొన్నారు. ఒక ఫ్యామిలీ ప్లానింగ్ లో ఉన్నానని, తల్లి కావాలని కోరుకుంటున్నట్లు మరియు అది తన మొదటి ప్రాధాన్యత అని నాకు చెప్పిందని నీలిమ పేర్కొన్నారు. అయితే పీరియడ్ సినిమాలకు చాలా సమయం పడుతుంది కాబట్టి ఆమె కొద్దిగా భయపడింది, కానీ మేము చేసిన ప్రీ-ప్రొడక్షన్ మరియు సరైన ప్లానింగ్ కారణంగా, మేము మొత్తం షూట్‌ను కాల వ్యవధిలో పూర్తి చేయగలుగుతామని ఎలాంటి టెన్షన్‌లు ఉండవని మేము ఆమెకు అభయం ఇచ్చామని నీలిమ పేర్కొంది.

చివరి సినిమా అని పేర్కొంది
అది విన్న వెంటనే, ఆమె చాలా సంతోషంగా ఉంది ఇది ఆమె తన చివరి చిత్రం అని ఆమె నాకు చెప్పిందని, దీని తర్వాత, ఆమె చాలా విరామం తీసుకుని పిల్లలను కనాలని, తన కుటుంబాన్ని ప్లాన్ చేసుకోవాలని కోరుకుంటుందని పేర్కొంది. ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం మేము కూడా షెడ్యూల్ తో సంబంధం లేకుండా సినిమా పూర్తి చేశామని పేర్కొన్నారు. అంటే సమంత ఫ్యామిలీ ప్లానింగ్ లో ఉండగానే ఏదో జరిగిందని భావిస్తున్నారు.