»   » కేటీఆర్‌కు సమంత బర్త్‌డే విషెస్.. ఒకరిపై మరొకరు ఆసక్తికరమైన ట్వీట్లు

కేటీఆర్‌కు సమంత బర్త్‌డే విషెస్.. ఒకరిపై మరొకరు ఆసక్తికరమైన ట్వీట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని సినీ నటి సమంత బర్త్ డే విషెస్ చెప్పారు. 'ప్రియమైన నాయకుడికి శుభాకాంక్షలు. నిజమైన స్ఫూర్తి, నమ్మకం కలిగించే నేత అని కేటీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. మీతో పరిచయం ఏర్పడటం గౌరవంగా భావిస్తున్నాను సార్ అని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.

సమంత చేసిన ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ చేనేత ప్రచారకర్తకు చాలా ధన్యవాదాలు. మీ అంకితభావంతో చేనేత పరిశ్రమకు మంచి స్పందన లభిస్తున్నది. మీరు నిర్వహించే చేనేత వస్త్ర ఫ్యాషన్ షో వోవెన్ 2017 కోసం ఎదురు చూస్తున్నాను అని బదులు ఇచ్చారు. కేటీఆర్ ట్వీట్‌కు థ్యాంక్స్ సర్ అని తిరిగి జవాబివ్వడం గమనార్హం.

Samantha wishes KTR on his birthday.

గతేడాది తెలంగాణ చేనేత వస్త్రాలకు సమంతను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన విషయం తెలిసిందే. చేనేత వస్త్రాలు ధరించి ఇటీవల ఓ మ్యాగజైన్‌ కోసం చేసిన సమంత ఫొటోషూట్ సోషల్‌మీడియాలో వైరల్ అయింది.

English summary
Telanagana Minister KTR celebrating his birthday on July 24th. In this Occassion, Actor Samantha wishes minister through social media. Then Minister KTR replied to Samantha.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu