»   » మా మామ రాజు: సమంత, థాంక్స్ డియర్ కోడలా..!: నాగార్జున

మా మామ రాజు: సమంత, థాంక్స్ డియర్ కోడలా..!: నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని నాగార్జున పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ రోజు రాజుగారి గ‌ది-2 సినిమా ఫ‌స్ట్‌లుక్‌ మోష‌న్ పిక్చ‌ర్ విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున మెంటలిస్ట్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సమంత చేతుల మీదుగా ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.

మామయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

మామయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

పోస్టర్ రిలీజ్ చేయటంతో పాటు తన మామయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా తెలియజేసింది సమంత. 'ఆయన ఎప్పటికీ రాజే. ఎందుకంటే తనని తాను ఎలా పరిపాలించుకోవాలో ఆయనకు బాగా తెలుసు. ప్రతీ ఏడాది గడుస్తున్న కొద్ది మా మామ మరింత గొప్పగా పాలిస్తున్నారు' అంటూ ట్వీట్ చేసింది సమంత. సమంత ట్వీట్ పై స్పందించిన నాగ్ ' థ్యాంక్స్ డియర్ కోడలా.. నువ్వ్ బెస్ట్' అంటూ రిప్లై ఇచ్చాడు.

మామా కోడళ్ళు

మామా కోడళ్ళు

భిమానులకి వీళ్ల సంభాషణ చాలా నచ్చేసినట్టుంది... ట్వీట్లతో సంబరాలు చేసుకుంటూ మురిసి పోతున్నారు. అయితే ఈ మామా కోడళ్ళు ఇలా పలకరించుకోవటం ఇదే మొదటి సారేం కాదు నాగార్జున గతం లో కూడా ఒకసారి సమంతపై తనకున్న అమితమైన ప్రేమను చాటుకున్నారు. 'కంగ్రాట్స్‌ కోడలా..' అంటూ సమంతని అభినందించారు నాగార్జున.

రారండోయ్‌ వేడుక చూద్దాం

రారండోయ్‌ వేడుక చూద్దాం

అప్పట్లో 'రారండోయ్‌ వేడుక చూద్దాం' సినిమాకి సంబంధించి మామా కోడళ్ళ మధ్య 'టెక్స్‌టింగ్‌' జరిగింది. అదేనండీ, ఫోన్‌లో ఛాటింగ్‌. ఆ ఛాటింగ్‌ జరిగిన వైనాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు నాగార్జున. 'కంగ్రాట్స్‌ కోడలా..' అని నాగార్జున పేర్కొంటే, 'లవ్‌ మామా' అని సమంత క్యూట్‌ క్యూట్‌గా మెసేజ్‌ చేసింది.

చేతిలో రుద్రాక్ష‌ల దండ‌ ప‌ట్టుకుని

చేతిలో రుద్రాక్ష‌ల దండ‌ ప‌ట్టుకుని

ఈ రోజు విడుదలైన రాజుగారి గ‌ది-2 సినిమా ఫ‌స్ట్‌లుక్‌ మోష‌న్ పిక్చ‌ర్‌లో నాగార్జున త‌న చేతిలో రుద్రాక్ష‌ల దండ‌ ప‌ట్టుకుని క‌నిపిస్తున్నారు. నాగ్ చేతిలో ఈ రుద్రాక్ష‌లు చూస్తోంటే ఆయ‌న అభిమానుల‌కు శివ సినిమాలో సైకిల్ చైన్ గుర్తుకొస్తోంది. ‘అప్ప‌ట్లో సైకిల్ చైన్ ప‌ట్టుకుని హిట్ కొట్టారు.. ఇప్పుడు రుద్రాక్ష‌లు ప‌ట్టుకుని హిట్ కొడ‌తార‌'ని కామెంట్ చేస్తున్నారు.

English summary
samantha, nagarjuna, akkineni, rajugari gadi 2, సమంత, నాగార్జున, అక్కినేని, రాజుగారి గది 2
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu