»   »  మగ బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సమీరా రెడ్డి

మగ బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సమీరా రెడ్డి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ సమీరా రెడ్డి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. గతేడాది ముంబైకి చెందిన వ్యాపార వేత్త అక్షయ్ వర్దేను పెళ్లాడిన ఆమె తాజాగా సోమవారం మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ విషయమై సుష్మా రెడ్డి మాట్లాడుతూ...‘దీని గురించి నేనేమీ చెప్పదలుచుకోలేదు. ప్రస్తుతం సమీర బెడ్ రెస్టులో ఉంది. పరిస్థితి కుదుట పడ్డాక ఆమె మీతో అన్ని విషయాలు మాట్లాడుతుంది. ఒక మూడు నాలుగు రోజుల సమయం ఇవ్వండి' అన్నారు.

సమీరా రెడ్డి-అక్షయ్ వర్దే వివాహం గతేడాది జనవరిలో జరిగిన సంగతి తెలిసిందే. స్పెషల్ డిజైన్డ్ మోటార్ బైక్స్ తయారు చేసే వ్యాపారాన్ని నిర్వహించే అక్షయ్ వర్దేతో సమీరా పెళ్లికి ముందు నుండే డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. సమీరా, అక్షయ్‌ల నిశ్చితార్థం 2013 డిసెంబర్‌లో జరిగింది. 2014లో వివాహం జరిగింది.

Sameera Reddy

వర్దేంచి పేరుతో అక్షయ్ తయారు చేసే మోటార్ బైక్స్ ను సమీరా ఇష్టంగా వినియోగించేది. వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి మోటార్ బైక్ కారణమని సమీరా స్నేహితురాలు తెలిపింది. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన 'ఓ మై గాడ్' చిత్రం కోసం వీరి సంస్థ ప్రత్యేకంగా బైకును డిజైన్ చేసింది.

సమీరారెడ్డి మన తెలుగమ్మాయే. రాజమండ్రిలో జన్మించింది. ఆమె తండ్రిపేరు సి.పి.రెడ్డి. సమీరా చిన్నతనంలోనే వీరి ఫ్యామిలీ ముంబైకి షిప్టయింది. ముంబైలోనే పెరిగిన సమీరా మోడలింగ్ రంగంలో ప్రవేశించి ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో చిరంజీవితో ‘జై చిరంజీవ', ఎన్టీఆర్ తో ‘అశోక్'తో పాటుప లు చిత్రాల్లో నటించింది.

English summary
It is a known fact that actress Sameera Reddy, tied the nuptial knot with businessman Akshai Varde in January 2014, and was also seen with a baby bump recently. The latest reports from Mumbai reveal that Sameera has been blessed with a baby boy. Both the mother and son are doing absolutely fine and quite elated about their baby.
Please Wait while comments are loading...