twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బెంగాల్ టైగర్' పై అవన్నీ రూమర్స్: సంపత్ నంది

    By Srikanya
    |

    హైదరాబాద్ :ఇప్పుడు అందరి చూపు రవుతేజ తాజా చిత్రం 'బెంగాల్ టైగర్' సినిమా పైనే ఉంది. అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం గురించి రకరకాల టాక్ లో ఇండస్ట్రీలోనూ, వెబ్ మీడియాలోనూ ప్రచారమవుతున్నాయి.

    ముఖ్యంగా ఈ కథ పవన్ కోసం రాసుకున్నది అని, కథ మొత్తం కోల్ కత్తాలో జరుగుతుందని...అయితే అవన్నీ కేవలం రూమర్స్ అని, ఆ వార్తల్లో నిజం లేదని దర్శకుడు సంపత్ నంది తేల్చేసాడు. చిత్రం రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలపై స్పందించారు. ఆయన ఏమన్నారో క్రింద చూడండి.

    Sampath Nandi clarifies about his latest Bengal Tiger

    సంపత్ నంది మాట్లాడుతూ...ఇది పవన్‌ కల్యాణ్‌ కోసం రాసుకొన్న కథ అంటున్నారు.. అందులో నిజం లేదు. రవితేజ గారి కోసమే రాసుకొన్న కథ. అయితే 'గబ్బర్‌ సింగ్‌ 2' సమయంలో ప్రత్యామ్నాయంగా అనుకొన్న టైటిల్‌ ఇది. కనీసం ఈ టైటిల్‌ కూడా పవన్‌కి వినిపించలేదు అని అన్నారు.

    'బెంగాల్‌ టైగర్‌'... టైటిల్‌ వినగానే ఇదేదో కోల్‌కతా నేపథ్యంలో సాగే కథ అని అందరూ అలానే అనుకొంటున్నారు. కానీ ఇది అచ్చమైన తెలుగు కథ. ఆత్రేయపురం లాంటి పల్లెటూర్లో, బాగా చదువుకొని కూడా ఉద్యోగం చేయక అల్లరి చిల్లరగా తిరిగే హీరో, తనకు జరిగిన ఓ అవమానాన్ని సవాల్‌గా తీసుకొని ఎలాంటి ప్రయాణం చేశాడన్నదే కథ. ఈ సృష్టిలో అన్ని జంతువులు ఉండగా పులినే జాతీయ జంతువుగా ఎందుకు ఎంచుకొన్నాం? దానికున్నశక్తి అలాంటిది. మా హీరో అలాంటి దృక్పథం కలవాడే. అందుకే ఆ పేరు నిర్ణయించాం అని అని వివరణ ఇచ్చారు.

    Sampath Nandi clarifies about his latest Bengal Tiger

    'బెంగాల్ టైగర్' చిత్రం లో రవితేజ క్యారక్టరైజేషన్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, 6 నిమిషాలుపాటు సాగే కామిడీ హైలెట్ గా ఉంటాయని సంపత్ నంది అన్నారు.

    డిసెంబరు 10న రిలీజ్ కి సిద్దం అవుతున్నా ఈ సినిమా లో బోమన్ ఇరానీ ముఖ్యమంత్రి పాత్రలో ఒదిరిపోయారని, రాశి ఖన్నా క్యారక్టర్ షాకింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక తమన్నా రోమాంటిక్ స్టైల్ ఇప్పటికే విడుదలైన పాటలతో అందరికి అర్థమవుతోంది.

    English summary
    Sampath Nandi clarifies 'Bengal Tiger' don't have any connection with West Bengal but his Hero possess all the qualities of a Bengal Tiger.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X