»   »  పవన్-దాసరి మూవీకి దర్శకుడు ఖరారయ్యాడు!?

పవన్-దాసరి మూవీకి దర్శకుడు ఖరారయ్యాడు!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దాసరి నారాయణరావు ఓ సినిమా నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి సినిమా చేయాలని చాలా రోజుల క్రితమే డిసైడ్ అయినప్పటికీ.....సరైన కథ లేక పోవడంతో ఈ ప్రాజెక్టు మొదలు కాలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి దర్శకుడు ఖారారైనట్లు సమాచారం.

సంపత్ నందికి దాసరి...ఈ ప్రాజెక్టు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. దాసరి ఇప్పటికే పవన్ కళ్యాణ్, సంపత్ నంది ఇద్దరితోనూ ప్రాజెక్టు విషయమై మాట్లాడారని తెలుస్తోంది. సంక్రాంతికి ఈ ప్రాజెక్టు గురించి దర్శకుడిని ఖరారు చేస్తూ దాసరి నుండి బిగ్ అనౌన్స్ మెంట్ రానుందని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.

Sampath Nandi To Direct Dasari-Pawan Kalyan Movie?

వాస్తవానికి సంపత్ నంది పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రానికి పని చేయాల్సి ఉన్నా....పలు కారణాలతో ఆయన తప్పుకున్నారు. అయితే పవన్-సంపత్ నంది మధ్య రిలేషన్ షిప్ బాగానే ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంపత్ నంది కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసారు. త్వరలో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నట్లు కూడా తెలిపారు.

సినిమా పరిశ్రమలో రచయితగా కెరీర్ మొదలు పెట్టిన సంపత్ నంది ‘ఏమైంది ఈవేళ' లాంటి చిన్న సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత రామ్ చరణ్ తో ‘రచ్చ', రవితేజతో ‘బెంగాల్ టైగర్' లాంటి భారీ చిత్రాలు చేసారు. సంపత్ నంది సామర్థ్యంపై పూర్తి నమ్మకంతో దాసరి నారాయణరావు ఈ ప్రాజెక్టు బాధ్యతలు అతని అప్పగించాలని నిర్ణయించుకున్నారట.

English summary
Dasari Narayana Rao announced a film with Power Star Pawan Kalyan. But, nothing was heard about it all these days. Now it turns out that he is actually planning to make a film with Pawan, but Sampath Nandi will direct it.
Please Wait while comments are loading...