»   » పవన్ కళ్యాణ్‌తో సినిమా, త్వరలో అన్ని చెప్తా: సంపత్ నంది

పవన్ కళ్యాణ్‌తో సినిమా, త్వరలో అన్ని చెప్తా: సంపత్ నంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించబడిన ‘బెంగాల్ టైగర్' చిత్రం త్వరలో రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన భార్య పిల్లలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సంపత్ నంది మాట్లాడుతూ ‘బెంగాల్ టైగర్ సినిమా కచ్చితంగా నవంబర్ లో రిలీజ్ కాబోతుంది అన్నారు.

‘గబ్బర్ సింగ్ 2' చిత్రం నుండి పలు కారణాలతో తప్పుకోవాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ తో ఫ్రెండ్షిప్ కొనసాగుతూనే ఉంది. త్వరలో పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా ని స్టార్ట్ చెయ్యబోతున్నాను. ఆ చిత్ర వివరాలు త్వరలో తెలియజేస్తాను అని సంపత్ నంది తెలిపారు.

Sampath Nandi film with Pawan Kalyan soon

బెంగాల్ టైగర్ గురించి నిర్మాత వివరణ...
రవితేజ నటిస్తున్న ‘బెంగాల్ టైగర్' రీ షూట్లు చేస్తున్నారని, అందుకే సినిమా విడుదల ఆలస్యం అవుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ చిత్ర నిర్మాత స్పందించారు. విడుదల ఆలస్యం కావడంపై వివరణ ఇచ్చారు. నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ" మా బెంగాల్ టైగర్ చిత్ర షూటింగ్ కార్క‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది. ఎటువంటి రీషూట్ లు చేయ‌టం లేదు. ఇటీవ‌ల ప్యాచ్‌వ‌ర్క్ తో గ‌మ్మ‌డికాయ కొట్టేసాము. పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్తిచేసుకున్నాము' అన్నారు.

మా చిత్రాన్ని ముందుగా నవంబ‌ర్ 5న విడుద‌ల చేయ‌టానికి నిర్ణ‌యించాము. అయితే అఖిల్ చిత్రం పోస్ట్‌పోన్ కావ‌టం తో న‌వంబ‌ర్ 5న రావ‌టం కుద‌ర‌లేదు. గ్లొబ‌ల్ ఫిల్మ్‌డిస్ట్రిబ్యూష‌న్ వారు మా చిత్రం మ‌రియు అఖిల్ చిత్రం యొక్క తెలంగాణా రాష్ట్ర పంపిణి రైట్స్ కొనియున్నారు, కావున రెండు పెద్ద‌చిత్రాలు విడుద‌ల‌కి గ్యాప్ కావ‌సివుంది. ఇరువురు సంప్ర‌దింపులు జ‌రిపాక విడుద‌ల తేది ని ఎనౌన్స్ చేస్తాము అన్నారు.

మా చిత్రం ఏ డేట్‌కైనా విడుద‌ల‌కి సిద్దంగా వుంది. ఎటువంటి రీషూట్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకోవ‌టం లేదు. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా మా చిత్ర యూనిట్ అంద‌రి స‌హ‌యంతో పూర్తిచేశాము. రవితేజ ఎనర్జిటిక్ పెర్ ఫార్మెన్స్ మెస్మరైజ్ చేస్తుంది. ఇటీవ‌ల మా బెంగాల్ టైగర్ ఆడియోకి సూపర్ రెస్పాన్స్ రావ‌ట‌మే కాకుండా సినిమాపై అంచ‌నాలు పెంచాయి. ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది ప్రేక్ష‌కుల నాడి బాగా తెలుసు. ఈ విష‌యం రేపు చూసిన ప్రేక్ష‌కులు చెప్తారు. ఈచిత్రం ర‌వితేజ గారి కెరీర్ లో బెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ ఫిల్మ్ గా నిలుస్తుంద‌ని మా న‌మ్మ‌కం" అని అన్నారు

ఈ చిత్ర‌లో మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ‌, త‌మ‌న్నా, రాశిఖ‌న్నా, బోమ‌న్ ఇరాని, బ్ర‌హ్మ‌నందం, రావు ర‌మేష్‌, షియాజి షిండే, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, హర్ష వ‌ర్ధ‌న్ రానే, పృద్వి, సురేఖ వాణి, అక్ష‌, శ్యామ‌ల‌, ప్రియ‌, ప్ర‌భు, ప్ర‌గ‌తి, నాగినీడు, ప్ర‌భ‌, ర‌మాప్ర‌భ తదిత‌రులు న‌టించ‌గా..బ్యాన‌ర్‌ : శ్రీ స‌త్యసాయి ఆర్ట్స్‌, కెమెరా: సౌంద‌ర్ రాజ‌న్‌, ఎడిట‌ర్‌: గౌత‌ం రాజు, ఆర్ట్‌: డి,వై.స‌త్య‌నారాయ‌ణ‌, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, సంగీతం భీమ్స్‌, నిర్మాత‌: కె.కె.రాధామెహ‌న్‌, క‌థ‌-మాట‌లు-స్ర్కీన్‌ప్లే-ద‌ర్శకత్వం: సంప‌త్ నంది.

English summary
Speaking to the media on the occasion of Tirumala Tirupati Devasthanam, Sampath said that Bengal Tiger will surely release in November. The director, who was supposed to helm Pawan Kalyan’s Gabbar Singh 2 initially, also said that he will soon reveal the details of his upcoming films with Pawan Kalyan as well as other stars.
Please Wait while comments are loading...