»   » సంపూ నువ్వు కేక: పవన్, మహేష్‌తో పాటు రజనీపై సెటైర్...

సంపూ నువ్వు కేక: పవన్, మహేష్‌తో పాటు రజనీపై సెటైర్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఏమైంది ఈ నగరానికి..ఓ వైపు పొగ, మరో వైపు నుసి అంటూ సినిమా థియేటర్‌కి వెళ్లిన ప్రతిసారి ఓ యాడ్ ప్రేక్షకులను విసిగిస్తూ ఉంటుంది. ఇపుడు దాన్ని బేస్ చేసుకుని బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఏకంగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రజనీకాంత్ సినిమాలపై సెటైర్లు పేల్చారు.

'ఈ 2016కు ఏమైంది? ఓ పక్క 'సర్దార్ గబ్బర్ సింగ్' మరో పక్క 'బ్రహ్మోత్సవం'. 'కబాలి' కూడా నోరు మొదపలేదు. ఈ నిర్లక్ష్యానికి 'కొబ్బరి మట్ట' పాడాలి చరమగీతం.' అంటూ ట్విట్టర్లో హల్ చల్ చేస్తున్న ఓ ట్వీట్ ను సంపూ రీ ట్వీట్ చేసారు.


అయితే ఇలాంటి ట్వీట్ చేస్తే పవన్, మహేష్, రజనీకాంత్ అభిమానుల నుండి దాడి మొదలవుతుందని ముందే ఊహించిన సంపూ ఇది నేను చేసింది కాదు... ఎవరో పంపారు, సరదాకి తీసుకోండి అంటూ ట్వీట్ చేసారు.


ఈ ఏడాది వచ్చిన టాప్ సినిమాలైన 'సర్దార్ గబ్బర్ సింగ్', 'బ్రహ్మోత్సవం' చిత్రాలు బాక్సాఫీసు వద్ద భారీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇక భారీ హైప్ తో వచ్చిన 'కబాలి' రిలీజ్ తర్వాత నీరుగారి పోయింది.


స్లైడ్ షోలో సంపూ ట్వీట్స్, కొబ్బరి మట్ట విశేషాలు...


సంపూ ట్వీట్

సంపూ ట్వీట్


సంపూర్ణేష్ బాబు ఆ మూడు సినిమాలపై సెటైర్ వేసేలా చేసిన ట్వీట్ ఇదే...


కొబ్బరి మట్ట

కొబ్బరి మట్ట


హృదయ కాలేయం చిత్రంతో బర్నింగ్ స్టార్‌గా మారిన క్రేజీ హీరో కమ్ కమెడీయన్ సంపూర్ణేష్ బాబు త్వరలో కొబ్బరి మట్ట సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.


త్రిపాత్రాభినయం

త్రిపాత్రాభినయం


ఈ సినిమాలో సంపూ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఆండ్రాయుడు, పాపా రాయుడు, పెదరాయుడుగా కనిపించబోతున్నాడు.


కామెడీ ప్రధానం

కామెడీ ప్రధానం


కామెడీ ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


కొబ్బరిమట్ట టీజర్


ఆ మధ్య విడుదలైన కొబ్బరిమట్ట అఫీషియల్ టీజర్ కు మంచి పేరొచ్చింది.


English summary
Sampoornesh Babu is very active on social media. He is currently working on his upcoming flick 'Kobbari Matta'. Recently, he surprised everyone as he re-tweeted a post on 'Twitter'. The tweet says, 'Ee 2016 ki emaindi? Oo pakka 'Sardaar gabbar Singh' maro pakka 'Brahmotsavam'. 'Kabali' kooda nooru medapaledu. Ee nirlakshya dhoraniki 'Kobbari Matta' paadali charama geetam'. As we know both 'Sardaar' and 'Brahmotsavam' became biggest disasters of 2016.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu