For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  సినిమా చూసి కొట్టారు, వడ అడిగితే రచ్చ, పూరి జగన్నాథ్ తిట్టారు, రాజమౌళి వల్ల దశ తిరిగింది: సంపూ

  |

  'హృదయ కాలేయం' సినిమాతో సూపర్ పాపులర్ అయిన సంపూర్ణేష్ బాబు టాలీవుడ్లో క్రేజీ కామెడీ హీరోగా మారిపోయాడు. వరుస అవకాశాలు దక్కించుకుంటూ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ మధ్య అతడు నటించిన సినిమాల సంఖ్య తగ్గినప్పటికీ త్వరలో 'కొబ్బరి మట్ట'తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాడు.

  తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న సంపూర్ణేష్ బాబు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన అసలు పేరు నరసింహాచారి. ఇండస్ట్రీకి ఒక కొత్త బాబు కావాలని డైరెక్టర్ స్టీవెన్ శంకర్ సంపూర్ణేష్ బాబు అని పేరు పెట్టారు. మొదట పరిపూర్ణేష్ బాబు అనుకున్నాం, చివరకు సంపూర్ణేష్ బాబు అని ఫిక్స్ చేశామని తెలిపారు.

  ఎవరికీ దొరక్కూడదనే పేర్లు మార్చుకున్నాం

  ఎవరికీ దొరక్కూడదనే పేర్లు మార్చుకున్నాం

  ‘‘హృదయ కాలేయం సినిమా అనుకున్నపుడు డైరెక్టర్ సాయి రాజేష్ పేరు కూడా స్టీవెన్ శంకర్ అని మార్చుకున్నాడు. ఏమైనా తేడా కొడితే ఎవరూ దొరక్కూడదు అని ఇలా పేర్లు మార్చేశాడు. కెమెరామెన్ పేరు కూడా రసూల్ కార్పెంటర్ అని మార్చి ఉంటుంది.'' అని సంపూర్ణేష్ బాబు తెలిపారు.

  ఆ సినిమాకు ఎంత ఖర్చు చేశామంటే..

  ఆ సినిమాకు ఎంత ఖర్చు చేశామంటే..

  ‘‘హృదయకాలేయం సినిమాకు అప్పట్లో 80 లక్షలు ఖర్చు పెట్టాం. కోటి పాతిక లక్షలకు అమ్మేశాం. ఈ సినిమా రిలీజ్ అయ్యాక చాలా మంది తిట్టారు. మూడు రోజులు భయంకరమైన ఫోన్స్ వచ్చాయి. మెచ్చుకునే వారు ఎక్కడ ఉన్నారనే విషయం పక్కన పెడితే చాలా మంది ఏంట్రా మీ సినిమా అని తిట్టారు. అప్పట్లో సినిమా ప్రమోషన్ల కోసం సోషల్ మీడియా నెట్వర్క్ బాగా వాడుకున్నది మేమే.'' అని సంపూ గుర్తు చేసుకున్నారు.

  రూ. 10 లక్షల్లో అనుకున్నాం... రాజమౌళి ట్వీటుతో దశ తిరిగింది

  రూ. 10 లక్షల్లో అనుకున్నాం... రాజమౌళి ట్వీటుతో దశ తిరిగింది

  సినిమాను 10 లక్షల్లో తీద్దాం అనుకున్నాం. ట్రైలర్‌కు ఎక్కువ హైప్ రావడం వల్ల దాన్ని నిలబెట్టుకోవడానికి అప్పటి వరకు తీసింది అంతా పక్కనపెట్టేసి మళ్లీ రీ షూట్ చేశాం. రాజమౌళిగారు ట్వీట్ వేయడంతో సినిమా దశ, దిశ మారిపోయింది.

  సినిమా చూసి మమ్మల్ని కొట్టడానికి వచ్చారు

  సినిమా చూసి మమ్మల్ని కొట్టడానికి వచ్చారు

  సినిమా విడుదలైన తర్వాత చూసి వెస్టిన్ హోటల్‌లో జరిగిన పార్టీకి వచ్చాము. అక్కడ కొంతమంది చాలా డ్రింక్ చేసి ఆడు హీరో ఏంట్రా, వాడు డైరెక్టర్ ఏంట్రా అని అనడంతో మా డైరెక్టర్ జీర్ణించుకోలేక ఎదురు తిరగారు. అప్పుడు చిన్న తోపులాట జరిగింది. మమ్మల్ని కొట్టడానికి వచ్చారు. మర్నాడు కేసు పెడదాము అనుకుంటే వాళ్లు స్టూడెంట్స్... రాత్రి ఏదో మందు తాగి అలా మాట్లాడాము అనడంతో వదిలేశాం.

  త్వరలో ‘కొబ్బరిమట్ట'.. అందుకే బడ్జెట్ పెరిగింది

  త్వరలో ‘కొబ్బరిమట్ట'.. అందుకే బడ్జెట్ పెరిగింది

  హృదయ కాలేయం తర్వాత వైరస్ అనే సినిమా చేశాం. కానీ పబ్లిసిటీ లేక, రాంగ్ టైమ్ రిలీజ్ వల్ల సరిగా ఆడలేదు. త్వరలో ‘కొబ్బరిమట్ట' రాబోతోంది. హృదయకాలేయం రిలీజ్ రోజు పోస్టర్ వేయడం వల్ల జనాలకు సినిమా ఎప్పుడో మొదలైన ఫీలింగ్ ఉంది. మధ్యలో నేను రెండు మూడు వేరే సినిమాలు చేశాను. ఈ మధ్య ‘కొబ్బరిమట్ట' షూటింగ్ పూర్తయింది. ఇందులో పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడు మూడు పాత్రల్లో కనిపిస్తాను. ఈ సినిమా బడ్జెట్ రూ. కోటి అనుకున్నాం. కానీ ఇతర ఆర్టిస్టుల డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం, సమయం ఎక్కువగా తీసుకోవడంతో బడ్జెట్ పెరుగుతూ వచ్చింది.

  పూరి జగన్నాథ్ తిట్టారు

  పూరి జగన్నాథ్ తిట్టారు

  హీరోగా కాకుండా కామెడీ క్యారెక్టర్లు కూడా వచ్చాయి.. చేశాను. పూరి గారు లోఫర్ సినిమాలో అడిగినపుడు ఆ సమయంలో ‘కొబ్బరి మట్ట' రిలీజ్ అవుతుందేమో అనుకుని సాయి రాజేష్ వద్దన్నాడు. ఇదే విషయం పూరి గారికి చెబితే తిట్టారు. ఏం మనిషయ్యా అతడు.. నువ్వేమైనా ఆడపిల్లవా? నిన్ను కాపాడటమెందుకు? అన్నాడు. దాంతో ఆయనతో రిలేషన్ కట్ అయిపోయిందేమో అనుకున్నాను. కానీ ఆయన అదేమీ మనసులో పెట్టుకోకుండా కొబ్బరి మట్ట సాంగ్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు.

  సినిమా ఛాన్స్ అడిగితే రూ. 6 లక్షలు అడిగారు

  సినిమా ఛాన్స్ అడిగితే రూ. 6 లక్షలు అడిగారు

  హృదయకాలేయం సినిమా రిలీజ్ ముందు సినిమా ఆవకాశాల కోసం ఓ ఆఫీసుకు వెళితే.. రూ. 6 లక్షలు ఇవ్వాలన్నారు. ఎందుకు? అంటే స్క్రీన్ టెస్టులు చేయాలని, ఫోటో షూట్లు చేయాలి అన్నాను. నా వల్ల కాదు అనడంతో చివరకు 50 వేల వరకు దిగి వచ్చారు. కానీ నా వద్ద అంత డబ్బు లేదని వచ్చేశాను.

  ఒక వడ ఎక్స్‌ట్రా అడిగితే పెద్ద రచ్చ చేశాడు

  ఒక వడ ఎక్స్‌ట్రా అడిగితే పెద్ద రచ్చ చేశాడు

  ఓసారి షూటింగులో టిఫిన్ చేస్తుండగా ఒక్క వడ ఎక్స్‌ట్రా వేయమని అడిగితే ... అక్కడ పెద్ద రచ్చ చేశారు. ఆ తర్వాత అర్థమైంది. ఇక్కడ లెక్క ప్రకారం మనుషులు ఉంటారు, వారికి సంఖ్యకు తగిన విధంగా టిఫిన్లు, భోజనాలు తెస్తారని, ఆ అనుభవం తర్వాత చాలా ఉపయోగపడింది.

  నావంతుగా లక్ష సాయం చేశాను

  నావంతుగా లక్ష సాయం చేశాను

  హుదూద్ తుఫాన్ వచ్చినపుడు నా వద్ద డబ్బు లేదు. అంతకు ముందు వైజాగ్ వెళ్లినపుడు వారి అభిమానం నన్ను కట్టిపడేసింది. నా స్థాయికి తగిన విధంగా లక్ష రూపాయల సహాయం చేశాను. మనం ఎంత ఇచ్చామన్నది కాదు, సహాయం చేశామా లేదా? అనేది ముఖ్యమనుకున్నాను.

  సన్నీ లియోన్ అని తెలియదు.. తెలిసిన తర్వాత సమ్మలోరి కిల్లా అనిపించింది

  సన్నీ లియోన్ అని తెలియదు.. తెలిసిన తర్వాత సమ్మలోరి కిల్లా అనిపించింది

  ‘కరెంట్ తీగ' సినిమాలో సన్నీ లియోన్ లవర్ పాత్రలో నటించాను. అప్పటి వరకు ఆమె గురించి ఏమీ తెలియదు. సినిమాలో అవకాశం వచ్చినపుడు సన్నీ లియోన్ పక్కన అని కూడా తెలియదు. వెళ్లగానే మోహన్ బాబుగారు సన్నీ లియోన్ గురించి అడిగితే తెలియదు గురువుగారు అని చెప్పాను. ఆమెతో సెట్స్‌లో ఏమీ మాట్లాడలేదు. ఒకే రోజు షూటింగ్ జరిగింది. షూటింగ్ అయిపోయేదాకా ఆమె ఎవరో తెలియదు. తెలిసిన తర్వాత సమ్మలోరి కిల్లా అనిపించింది... అంటూ సంపూర్ణేష్ బాబు చెప్పుకొచ్చారు.

  English summary
  Sampoornesh Babu about his film industry journey. Sampoornesh Babu is an Indian film actor who works in Telugu cinema. He made his acting debut as the lead role in the 2014 film Hrudaya Kaleyam, for which he won the CineMAA Award for Best Actor in a Comic Role. He is known for his comedic films and was also a contestant in Bigg Boss Telugu.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more