»   » ఏడుగురు భామలతో సంపూర్ణేష్ బాబు రొమాన్స్

ఏడుగురు భామలతో సంపూర్ణేష్ బాబు రొమాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'హృదయ కాలేయం' చిత్రం ద్వారా కామెడీ హీరోగా పరిచయమైన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట' అనే మరో చిత్రం చేయడానికి రెడీ అయ్యాడు. 'ది లీవ్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ మ్యాన్' అనేది సబ్ టైటిల్. ఈ చిత్రాన్ని కూడా హృదయ కాలేయం నిర్మాత సాయి రాజేష్ నిర్మించబోతున్నారు.

'హృదయ కాలేయం' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధించడానికి కారణం సంపూర్ణేష్ కామెడీ నటనతో పాటు, సినిమాకు ముందు నుండి ఇంటర్నెట్ ద్వారా కల్పించిన వినూత్న ప్రచారమే. తాజాగా 'కొబ్బరి మట్ట' చిత్రం విషయంలోనూ ఇదే వ్యూహాన్ని అనుసరించేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు.

Sampoornesh Babu to act with 7 herioines

ఇందులో భాగంగా ఈచిత్రంలో సంపూర్ణేష్ సరసన ఏడుగురు హీరోయిన్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసారు. ఇందులో సంపూర్ణేష్ బాబు పెదరాయుడు చిత్రంలో మోహన్ బాబు గెటప్‌ను పోలి ఉండటం గమనార్హం. దీంతో ఈచిత్రం మోహన్ బాబు పెదరాయుడు చిత్రానికి స్పూఫ్‌లా ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే 'కొబ్బరి మట్ట' చిత్రంలో సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభినయంలో కనిపించబోతుననాడు. పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయిడ్ అనే మూడు పాత్రలు పోషించబోతున్నాడట. 'హృదయ కాలేయం' చిత్రం ద్వారా వచ్చిన క్రేజ్‌ను కాపాడుకోవడానికి సంపూర్ణేష్ బాబు తనదైన ప్రయత్నాలు చేస్తున్నాడు.

English summary
Sampoornesh Babu to act with seven herioines in his next movie Kobbari Matta.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu