»   » కష్టాల్లో ఐరన్‌లెగ్ శాస్త్రి ఫ్యామిలీ: సంపూ, సందీప్ కిషన్ చేయూత...

కష్టాల్లో ఐరన్‌లెగ్ శాస్త్రి ఫ్యామిలీ: సంపూ, సందీప్ కిషన్ చేయూత...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్వతహాగా పురోహితుడైన ఐరన్‌లెగ్‌ శాస్త్రి సినిమా రంగానికి రావడం ఒక యాక్సిడెంట్‌. స్వధర్మాన్ని మానుకుని ఆయన హాస్యనటుడిగా సినిమా రంగానికి వచ్చారు. ప్రేక్షకులకు హాస్యాన్ని పంచి తను మాత్రం విషాదాన్ని తన పెద్ద కడుపులో దాచుకున్నారు.

మంచి నటనా సామర్ధ్యం ఉన్నా ఆయన ఐరన్‌లెగ్‌గా స్ధిరపడిపోవడంతో ఆయన నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్‌ కావడంతో ఆయన సన్నిహితులే వాడిది ఐరన్‌ లెగ్‌, వాడికి పాత్ర ఇవ్వొద్దు అంటూ అడ్డుపడ్డారు. అతనిది నిజంగా ఐరన్‌ లెగ్‌ అయితే ఆయన నటించిన ఎన్నో సినిమాలు హిట్‌ అయి ఉండేవా? అదే ఆవేదనతో శాస్త్రి బాధ పడేవాడు. అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయారు.

Sampoornesh Babu and Sandeep donation

శాస్త్రి మరణం తర్వాత ఆయన ఫ్యామిలీ రోడ్డున పడింది. దేవాలయాల్లో ప్రసాదం వండి అతని భార్య యూడొచ్చిన ఇద్దరు పిల్లల్ని పూటగడవని స్థిలో చదివిస్తోంది. తినడానికి పట్టెడన్న లేని స్థితిలో పిల్లల్ని చదివించే స్తోమత లేక దీనంగా దాతల సహాయం కోసం ఆ కుటుంబం ఎదురు చూస్తోందంటూ టీవీ ఛానలల్స్ లో రావడంతో తెలుగు సినిమా పరిశ్రమ నుండి నటుడు సంపూర్ణేష్ బాబు, సందీప్ కిషన్ స్పందించారు.

నటుడు సంపూర్ణేష్ బాబు తన వంతుగా రూ. 25వేల సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఇతరులు కూడా వారి కుటుంబానికి సహాయం చేయాలని కోరారు. సందీప్ కిషన్ కూడా వారి కుటుంబానిక సహాయం అందించారు. శాస్త్రి కుటుంబానికి సహాయం చేయడానికి మరికొంత మంది ముందుకు రావాల్సిన అవసరం ఉంది.

English summary
Iron leg shastry's family suffering with financial problems, they are waiting for finacial support. Burning Star Sampoornesh, Sandeep Kishan donated some and tweeted about this on twitter acoount respectivly.
Please Wait while comments are loading...