»   » 10 వేలు, 15 వేలు బహుమానం ప్రకటించిన సంపూ!

10 వేలు, 15 వేలు బహుమానం ప్రకటించిన సంపూ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం 'కొబ్బరి మట్ట' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం వెస్ట్ గోదావరి జిల్లాలోని పాలకొల్లుకు సమీపంలోని అరటికట్ల గ్రామంలో జరుగుతోంది. ఈ సందర్భంగా అక్కడికి దగ్గర్లోని పాఠశాలను సందర్శించాడు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో సరదాగా గడిపాడు.

పవన్ కళ్యాణ్ మీద కామెంట్: గట్టిగా బుద్ది చెప్పిన సంపూ!
వారి ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తూ... రాప్ ర్యాంక్ సాధించే బాలురకు రూ.10,000, బాలికలకు 15,000 ఇస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. చదువు విషయంలో అశ్రద్ధ చూపించొద్దని... బాగా చదువుకొని మీ తల్లితండ్రులకు... దేశానికి సేవ చేయాలని ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబు విద్యార్థుల్ని కోరారు.

కొబ్బరిమట్ట: సంపూ 'ఆండ్రాయుడు' లుక్ (ఫోటోస్)

హృదయ కాలేయం' సినిమాతో టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుని వరుస అవకాశాలతో తూసుకెలుతున్న సంపూర్ణేష్ బాబు బాబు త్వరలో 'కొబ్బరి మట్ట'తో ప్రేక్షకులపై దాడి చేయబోతున్నాడు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభినయం చేస్తుండటం గమనార్హం.

Sampoornesh Babu Announced Prize Money

పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడు అనే మూడు డిఫరెంట్ పాత్రల్లో సంపూర్ణేష్ బాబు కనిపించబోతున్నారు. రూపక్ రొనాల్డ్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్‌, గుడ్‌ సినిమా గ్రూప్‌, సంజన మూవీస్‌ పతాకంపై ఆది కుంభగిరి, సాయి రాజేష్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

English summary
Sampoornesh Babu Announced Prize Money for school students.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu