»   » హాట్ టాపిక్ :ఫోర్న్ స్టార్ తో సంపూర్ణేష్ బాబు

హాట్ టాపిక్ :ఫోర్న్ స్టార్ తో సంపూర్ణేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హృదయకాలేయం చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన నటుడు సంపూర్ణేష్ బాబు. అతనికి తెలుగు పరిశ్రమనుంచి మంచి ఆఫర్సే వస్తున్నాయి. తాజాగా సన్నిలియోన్ సరసన అతను నటిస్తున్నాడని సమాచారం. మంచు మనోజ్ హీరోగా రూపొందుతున్న కరెంట్ తీగ చిత్రంలో సన్ని సరసన సంపూర్ణేష్ భర్తగా చేస్తున్నాడని అంటున్నారు. ఈ హాట్ పెయిర్ మధ్య కామెడీ బాగా పండించాచరని తెలుస్తోంది.

మంచు మనోజ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం 'కరెంటు తీగ'. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తారు. లగడపాటి శ్రీధర్‌ నిర్మాత. ఈ చిత్రంలో సన్నీలియోన్‌ ఓ ప్రత్యేక పాత్రలో దర్శనమివ్వబోతోంది. ఈ విషయాన్ని హీరో మంచు మనోజ్ ఖరారు చేసారు. అయితే ఆమెకు రెమ్యునేషన్ ఇప్పుడు అంతటా చర్చ అంతటా మొదలైంది.

Sampoornesh babu as Sunny Leone husband in Current teega Movie

ఈ చిత్రం కోసం సన్నీకి మూడు రోజులు డేట్స్ కేటాయించిందని, అందు నిమిత్తం 35 లక్షలు సమర్పించారని తెలుస్తోంది. రోజుకు పది లక్షలు చొప్పున, ఖర్చులు నిమిత్తం 5 లక్షలు ఇచ్చారని సమాచారం. తెలుగులో సన్నీ ఒప్పుకొన్న మొదటి చిత్రమిదే కావటంతో ఇంత ఎక్కువ ఖర్చు పెట్టారంటున్నారు. హీరోయిన్ కి కూడా అంత ఇవ్వటం లేదని అంటున్నారు. అంత రెమ్యునేషన్ అనే సరికి మొదట వెనకంజ వేసారని, అయితే మనోజ్ పట్టుపట్టి మరీ ఒప్పించాడని చెప్పుకుంటున్నారు.

మంచు మనోజ్ మాట్లాడుతూ... సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర వుంది. దీనికోసం ఎవరిని తీసుకుంటే బాగుంటుందా అని చాలా మందిని వెతికాం. అయితే అందులో నెంబర్‌వన్ ఎవరున్నారా అని వెతికితే సన్నీలియోన్ కనిపించింది. ఈ సినిమా కోసం ఆమెనే తీసుకోవడానికి ఆమెకున్న క్రేజ్ కారణం. అంతే కాకుండా ఇందులోని పాత్ర ఆమె లాంటి నటి చేస్తేనే బాగుంటుందని భావించి సన్నీలియోన్‌ను తీసుకోవడం జరిగింది అన్నారు.

''మనోజ్‌ ఎనర్జీని మరో స్థాయిలో చూపించే చిత్రమిది. అన్ని వాణిజ్య హంగులూ ఉంటాయి'' అని చిత్రబృందం చెబుతోంది. త్వరలోనే 'కరెంటు తీగ'కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయి.

English summary
Sampoornesh babu as Sunny Leone husband in Current teega Movie. Sunny Leone was offered a whopping Rs.35 lakhs for just three day shooting for her role in ‘Current Theega’ .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu