»   » ఆయన ఆకాశం, ఈయన అణువు.... మహేష్ కత్తిపై సంపూ కామెంట్!

ఆయన ఆకాశం, ఈయన అణువు.... మహేష్ కత్తిపై సంపూ కామెంట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద సినిమా క్రిటిక్, బిగ్ బాస్ కంటెస్టెంట్ మహేష్ కత్తి చేసిన కామెంట్లకు అభిమానులు హర్టవ్వడం, సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా చాలా రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో సంపూర్ణేష్ బాబు ఈ వివాదంపై స్పందించారు.

ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ.... మహేష్ కత్తి తీరును తప్పుబట్టారు. మాట్లాడే స్వతంత్రం ఎవరికైనా ఉంటుంది... కానీ ఏం మాట్లాడాలో మనం ఆలోచించి మాట్లాడాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నామో మొదట తెలుసుకోవాలి... అని సంపూ అన్నారు.

చాలా బాధ పడ్డాను

చాలా బాధ పడ్డాను

ఒక మాట అనడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు. కానీ ఎంత మంది హర్ట్ అయి ఉంటారు. ఏంటి ఇలా అన్నారు అని నేను కూడా ఒక క్షణం బాధ పడ్డాను. అభిప్రాయాలు చెప్పే హక్కు అందరికీ ఉంటుంది. ఏదైనా చెప్పాలనుకుంటే నీట్‌గా చెప్పొచ్చు.... అని సంపూర్ణేష్ బాబు అభిప్రాయ పడ్డారు.

ఉండాల్సింది వాగే చాతుర్యం కాదు

ఉండాల్సింది వాగే చాతుర్యం కాదు

అనంత శ్రీరామ్ గారు ఒక మాట చెప్పారు. వాక్ చాతుర్యం ఉండాలి కానీ, వాగే చాతుర్యం ఉండకూడదు అని. అది నాకు బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ గారు చేయి చూపిస్తే కోట్ల మంది అలా వెళ్లిపోతారు. ఆయన ఏం చెబితే అది చేస్తారు. తనలో నటించే టాలెంట్ లేకుంటే.... కోట్ల మందిని ఎలా ఆకట్టుకుంటున్నాడు? చాలా మంది నటులు ఉన్నారు, అందరికీ ఈ ఫాలోయింగ్ ఎందుకు లేదు? అలాంటి వ్యక్తి గురించి మహేష్ కత్తి అలా అనడం నాకు నచ్చలేదు... అని సంపూర్ణేష్ బాబు అన్నారు.

ఆయన ఆకాశం... ఈయన అణువు

ఆయన ఆకాశం... ఈయన అణువు

ఆయన ఆకాశం అయితే... ఈయన అణువు, దానికి దీనికి పోలికి అవసరం లేదు అంటూ సంపూర్ణేష్ బాబు తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

పదేళ్లు పవన్ కళ్యాణ్ కిక్ అలా ఉండిపోవాలి

పదేళ్లు పవన్ కళ్యాణ్ కిక్ అలా ఉండిపోవాలి

వాస్తవానికి నేను మోహన్ బాబుకు గారి ఫ్యాన్. కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. నేను ఇంత వరకు ఇండస్ట్రీలో చాలా మందిని కలిశాను. కానీ పవన్ కళ్యాణ్‌ను కలవలేదు. మనోజ్ అన్న పెళ్లికి వచ్చినపుడు ఆయన నుండి దూరంగా వెళ్లిపోయి అలా చూస్తూ ఉండిపోయాను. తర్వాత ఈటీవీ ఫంక్షన్‌కు వచ్చినపుడు కూడా కలవలేదు. తర్వాత ‘కాటమరాయుడు' షూటింగ్ జరుగుతున్న సమయంలో వెళ్లాను. బ్రేక్‌లో పవన్ కళ్యాణ్ గారు అలా కూర్చుని ఉండిపోయారు. దూరం నుండే ఓ 20 నిమిషాలు అలా చూసి వచ్చేశాను. కావాలనే కలవలేదు. హృదయ కాలేయం ఇచ్చిన కిక్కు నాలో ఇంకా ఉంది. అదే విధంగా బిగ్ బాస్ తర్వాత కూడా మంచి కిక్కు వచ్చింది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే ఆ కిక్కు ఓ పదేళ్లు అలాగే ఉండి పోవాలి. అందుకే మంచి సమయం కోసం చూస్తున్నాను... అని సంపూర్ణేష్ బాబు అన్నారు.

English summary
Tollywood star Sampoornesh Babu Fires On Mahesh Kathi For Commenting Power star Pawan Kalyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu