రక్తాన్ని, కన్నీళ్లను ధారపోశాను.. రెడీగా ఉండండి.. సంపూ
హృదయ కాలేయం చిత్రంతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన సంపూర్ణేష్ బాబు అలియాస్ సంపూ చిత్రాలు ఈ మధ్య కాలంలో వెండితెరను తాకిన దాఖలాలు తక్కువే. అడపదడపా అతిథి పాత్రల్లో కనిపించిన సంపూ.. ప్రస్తుతం కొబ్బరిమట్ట చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. నాలుగేళ్ల క్రితం మొదలుపెట్టిన ఈ చిత్రం పలు కారణాలుగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమా గురించి సంపూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

''ఫైనల్‌గా.. కొబ్బరిమట్టతో మేము రెడీ.. సంవత్సరంన్నర కష్టం.. కష్టం అనేది చిన్నమాట.. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నా రక్తం, చెమట, కన్నీళ్లను ధారపోశాను. రిలీజ్ డేట్ కోసం రెడీగా ఉండండి'' అంటూ సంపూ ట్వీట్‌లో పేర్కొన్నాడు.
కొబ్బరి మట్ట చిత్రం గురించి ఓ మాట కూడా చెప్పేశాడు. ముగ్గురు భార్యలున్న ఓ మనసున్న భర్త కథ అని మరో ట్వీట్ చేశాడు. ఏదిఏమైనా మరోసారి సంపూ ప్రేక్షకులను అలరించడం ఖాయమని దర్శకుడు సాయి రాజేష్ (రూపక్ రొనాల్డ్‌సన్) ధీమా వ్యక్తం చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











