»   » నేను తెలంగాణ, గుండె బరువెక్కింది: పవన్ కళ్యాణ్ స్పీచ్‌పై సంపూర్ణేష్ బాబు!

నేను తెలంగాణ, గుండె బరువెక్కింది: పవన్ కళ్యాణ్ స్పీచ్‌పై సంపూర్ణేష్ బాబు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడి హోదాలో ఇటీవల తిరుపతి సభలో మరోసారి ఆవేశంగా స్పందించిన సంగతి తెలిసిందే. విభజన వల్ల సీమాంధ్రులకు అన్యాయం జరిగిందని, ప్రత్యేక హోదా వస్తేనే ఇక్కడి ప్రజల బ్రతుకులు బాగుపడతాయంటూ ఆయన ప్రసంగించిన సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ స్పీచ్ గురించి సినీ పరిశ్రమ నుండి ప్రముఖులెవరూ స్పందించక పోయినా... కామెడీ హీరో సంపూర్ణేష్ బాబు తనదైన రీతిలో స్పందించారు. 'నేను తెలంగాణలో పుట్టాను. నా సోదర తెలుగు రాష్ట్ర ప్రజలు ఇంత కష్టాల్లో ఉన్నారని, వారి గుండెల్లో ఇంత ఆగ్రహం ఉందని శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ద్వారా తెలిసి గుండె బరువెక్కింది' అంటూ తన సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు.

'రాష్ట్రాలు వేరైనా, కష్టం వచ్చినపుడు అందరూ ఒక్కటే... సీమాంధ్రుల బాధని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వాడికి ఉంది. ముఖ్యంగా సినీ పరిశ్రమకి. వారు కొంటున్న టికెట్ డబ్బులతోనే మనం బ్రతుకుతున్నాం. పవన్ గారి ఉద్యమంలో నేను ఒక గొంతు అవుతున్నాను' అన్నారు.

దీని వల్ల ఏ ఉపయోగం జరుగక పోవచ్చు.. కానీ ఎమో నా వల్ల మరొకరు ధైర్యంగా ముందుకు రావొచ్చు. జై హింద్... సదా మీ ప్రేమకి బానిస, మీ సంపూర్ణేష్ బాబు అంటూ తన సోషల్ మీడియా పేజీలో పేర్కొన్నారు సంపూర్ణేష్ బాబు.

సంపూర్ణేష్ బాబు

సంపూర్ణేష్ బాబు

పవన్ కళ్యాణ్ స్పీచ్ కు మద్దతు ఇస్తూ ఇప్పటి వరకు సినీ పరిశ్రమ నుండి ఏ ఒక్కరూ మాట్లాడలేదు. పవన్ స్పీచ్ ముగిసిన వెంటనే సంపూ స్పందించడం విశేషం.

తెలంగాణ వ్యక్తి

తెలంగాణ వ్యక్తి

సీమాంధ్రకు చెందిన స్టార్స్ మౌనంగా ఉన్నా... తెలంగాణ ప్రాంతం వాడై ఉండి తమ బాధలపై స్పందించినందుకు సంపూపై హర్షం వ్యక్తం చేస్తున్నారుస

గుండె బరువెక్కింది

గుండె బరువెక్కింది

గుండె బరువెక్కింది అంటూ సంపూ కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయింది.

పవన్ పార్టీలో చేరుతాడా?

పవన్ పార్టీలో చేరుతాడా?

సంపూర్ణేష్ బాబు ఉత్సాహం చూస్తుంటే త్వరలో అతను పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరడం ఖాయం అనే వాదన వినిపిస్తోంది.

అభిమానుల గొడవలపై మౌనం

అభిమానుల గొడవలపై మౌనం

అభిమానులు గొడవ పడటం, ఇటీవల ఓ అభిమాని హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఇది వివాదాస్పద అంశం కావడంతో సంపూర్ణేష్ బాబు దీనిపై స్పందించలేదు.

సినిమా

సినిమా

సంపూర్ణేష్ బాబు త్వరలో కొబ్బరి మట్ట సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

హైప్

హైప్

ఆ మధ్య విడుదలైన కొబ్బరి మట్ట మూవీ టజర్ తో సినిమాపై అంచి అంచనాలు ఏర్పడ్డాయి.

త్వరలో రిలీజ్

త్వరలో రిలీజ్

కొబ్బరి మట్ట సినిమా షూటింగ్ పూర్తయినా ఇంకా రిలీజ్ కాలేదు.... పెద్ద సినిమాలు ఉండటంతో కావాలనే సినిమా రిలీజ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

English summary
Sampoornesh babu has posted his excitement and views about awankalyan’s JanaSenaPrasthanam Speech in facebook.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu