»   »  విభిన్నం....('హృదయ కాలేయం' ప్రివ్యూ)

విభిన్నం....('హృదయ కాలేయం' ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యూ ట్యూబ్ లో, ఫేస్ బుక్, ట్విట్టర్ లలో ఈ మధ్య కాలంలో ఇంత క్రేజ్ తెచ్చుకున్న తెలుగు చిత్రం లేదనే చెప్పాలి. ఫస్ట్ లుక్ నుంచి ఓ విభిన్న చిత్రంగా ప్రచారమవుతూ వస్తున్న ఈ సినిమా అందరూ కొత్తవాళ్ళతో ఓ ప్రెష్ ఫీల్ తో ముస్తాబయ్యి ఈ రోజు విడుదల అవుతోంది. బిజినెస్ పరంగా కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం కేవలం సోషల్ నెట్ వర్కింగ్ జనాలకే పరిమితమా లేక రెగ్యులర్ సినీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుందా అనేది ఈ రోజు ఓపినింగ్స్ ని బట్టి తెలుస్తుంది. అలాగే విభిన్నత అనేది టీజర్స్, ఫస్ట్ లుక్ కే మాత్రమేనా లేక సినిమాలో కూడా ఆద్యంతం మెయింటైన్ చేసారా అన్నది కూడా మరికొద్ది గంటల్లో తెలిసే విషయం.

హీరో మాట్లాడుతూ ''ఇది ఏ చిత్రానికీ వ్యంగ్యరూపం కాదు. కుటుంబం మొత్తం చూడదగ్గ ప్రేమకథా చిత్రమిది. దర్శకుడు స్టీవెన్‌ శంకర్‌ సినిమాను తెరకెక్కించిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. యాక్టర్ కావాలనేది నా కల. కథ వినగానే సినిమా చేయడానికి సిద్ధమయ్యాను. తొలి పోస్టర్‌తోనే మా సినిమాకు గుర్తింపురావడానికి కారణం రాజమౌళిగారు. ఆయనకు మేం రుణపడి ఉంటాం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా టాలెంట్ ఉంటే ఎదగొచ్చు'' అన్నారు.

Sampoornesh Babu’s Hrudaya Kaleyam movie preview

దర్శకుడు మాట్లాడుతూ ''దక్షిణ అమెరికా, జర్మనీలో విడుదలవుతున్న తొలి తెలుగు చిత్రమిది. ప్రతి సన్నివేశం హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది. పక్కా కమర్షియల్ సినిమా ఇది. సినిమాను 29 రోజుల్లో పూర్తి చేశాం. నా టీమ్ లేకపోతే ఈ సినిమా లేదు. అందుకే నేను ఎ ఫిల్మ్ బై అని నా పేరు వేసుకోలేదు'' అన్నారు.


బ్యానర్: అమృత క్రియేషన్స్
నటీనటులు: సంపూర్ణేష్ బాబు, కావ్య కుమార్, ఇషికాసింగ్, కత్తి మహేష్ తదితరులు
సంగీతం: కెకే
నృత్యాలు: హరి
ఫైట్స్: స్టంట్స్ జాషువా
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: స్టీవెన్ శంకర్
నిర్మాత: సాయి రాజేష్
విడుదల తేదీ:04, ఏప్రియల్ 2014.

English summary
Sampoornesh babu’s much awaited Hrudaya Kaleyam movie has been hit theatres on Friday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu