»   »  టాలీవుడ్లోకి సంపూర్ణేష్ బాబు ‘వైరస్’ (ఫోటోస్)

టాలీవుడ్లోకి సంపూర్ణేష్ బాబు ‘వైరస్’ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హృద‌య‌లేయం, సింగం 123 వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన సంపూర్ణేష్ బాబు హీరోగా పుల్లారేవు రామ‌చంద‌ర్ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ఎ.య‌స్‌.ఎన్‌.ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఎస్‌.ఆర్‌.కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో స‌లీం ఎం.డి. శ్రీనివాస్ మంగ‌ళ నిర్మాత‌లుగా రూపొందుతోన్న చిత్రం వైర‌స్‌. నో వ్యాక్సిన్ ఓన్లీ ట్యాక్సిన్ ట్యాగ్‌లైన్‌.

గీత్‌షా, నిధిషా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుని నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. ఈ సంద‌ర్భంగా...చిత్ర నిర్మాత‌లు స‌లీం ఎం.డి. శ్రీనివాస్ మంగ‌ళ సినిమా గురించి విశేషాలు వెల్లడించారు.

 వైరస్

వైరస్

``సంపూర్ణేష్ బాబు హీరోగా `వైర‌స్` సినిమాను మా బ్యాన‌ర్‌లో రూపొందించ‌డం ఎంతో ఆనందంగా ఉంది.భ‌యాన‌క బీభ‌త్స కామెడి మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ అండ్ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ సంపూ వైర‌స్ `నో వ్యాక్సిన్ ఓన్లీ ట్యాక్సిన్` ట్యాగ్‌లైన్‌తో రానున్న ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యిందిని నిర్మాత తెలిపారు.

 సంపూర్ణేష్‌బాబు

సంపూర్ణేష్‌బాబు

ప్ర‌స్తుతం సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. సంపూర్ణేష్‌బాబు త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తారు. మీనాక్షి భుజంగ్ సంగీతం, సునీల్ క‌శ్య‌ప్‌గారి రీరికార్డింగ్‌, వి.జె సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను త్వ‌ర‌లో విడుద‌ల చేస్తున్నాం`` అన్నారు.

 నటీనటులు

నటీనటులు

సంపూర్ణేష్‌బాబు, గీత్‌షా, నిధిషా, వెన్నెల‌కిషోర్, వైవా హ‌ర్ష‌, చ‌మ్మ‌క్ చంద్ర‌ త‌దిత‌రులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

 తెర వెనక

తెర వెనక

ఈ చిత్రానికి సంగీతంః మీనాక్షి భుజంగ్‌, రీ రికార్డింగ్ః సునీల్ క‌శ్య‌ప్‌, సినిమాటోగ్ర‌ఫీః వి.జె, ఎడిటింగ్ః మార్తాండ్ కె.వెంక‌టేష్‌, నిర్మాత‌లుః స‌లీం ఎం.డి. శ్రీనివాస్ మంగ‌ళ, ద‌ర్శ‌క‌త్వంః ఎస్‌.ఆర్‌.కృష్ణ‌.

English summary
Sampoornesh Babu who has grabbed the attention of Telugu audiences with several movies like ‘Hrudaya Kaleyam’, is coming with his another comedy entertainer movie ‘Virus’ which will come with the tagline ‘No Vaccine Only Toxin’. According to the latest update, the entire shoot of the movie has been wrapped and the post production work has been started.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu