»   »  సంపూర్ణేష్ బాబే బెస్ట్...కొత్త పోస్టర్ వచ్చేసింది

సంపూర్ణేష్ బాబే బెస్ట్...కొత్త పోస్టర్ వచ్చేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హృదయ కాలేయం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సంపూర్ణేష్‌బాబు హీరో గా నెట్ జనులకు అమిత ప్రీతి పాత్రుడు. ఆ మధ్యన కరెంట్ తీగ, బందిపోటు చిత్రాల్లో చేసిన ఆయన తాజాగా మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సింగం 123 టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని మంచు విష్ణు తమ 24 ఫ్రేమ్స్ పతాకంపై నిర్మించనున్నారు. ఈరోజు ఉగాది కావటంతో ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ చిత్రం కొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఇక్కడ మీరు చూస్తున్నది అదే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మంచు విష్ణు మాట్లాడుతూ... ‘సింగం 123' నాకు చాలా ప్రతిష్ఠాత్మక చిత్రం. ఫేవరేట్‌ ప్రాజెక్ట్‌. నా మెయిన్‌ కాన్‌సన్‌ట్రేషన్‌ దానిమీదే. అక్షిత్‌శర్మ అనే ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థి దాన్ని డైరెక్ట్‌ చేస్తున్నాడు. జేమ్స్‌బాండ్‌, హాట్‌ షాట్స్‌, ట్రూ లైస్‌ సినిమాల తరహాలో యాక్షన్‌ కామెడీ ఫిల్మ్‌. వెరీ వెరీ గ్లామరస్‌ ఫిల్మ్‌ అన్నారు మంచు విష్ణు.

దర్శకుడు మాట్లాడుతూ.... సంపూర్ణేష్‌బాబు నుంచి ప్రేక్షకులు ఏ తరహా వినోదాన్ని కోరుకుంటున్నారో అది ఈ సినిమాలో వంద శాతం వుంటుంది. కథకు తగ్గ హీరో కుదిరారు. ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించనున్నాం అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ నేటి వాస్తవ పరిస్థితులని ప్రతిభింబిస్తూ..నేటి యువతరాన్ని ఉత్తేజపరుస్తూ ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

Sampoornesh Babu Singham 123 Ugadi Poster

అలాగే...సంపూర్ణేష్ బాబు మరోసారి తన సత్తా చూపించటానికి సిద్దమవుతున్నారు. ఈ సారి "డాన్ ఘంటశాల" గా ఆయన కనిపించనున్నారు. వేర్ ఈజ్ విద్యాబాలన్ అనే చిత్రంలో ఆయన కామెడీ విలన్ పాత్ర పోషిస్తున్నారని సమాచారం. సెకండాఫ్ లో సంపూర్ణేష్ బాబు కనిపించి, నవ్విస్తాడంటున్నారు. ఈ పాత్ర బాగా క్లిక్ అవుతుందని దర్శక,నిర్మాతలు బాగ నమ్మకం పెట్టుకున్నారు.
ప్రిన్స్‌, జ్యోతిసేథీ జంటగా శ్రీభ్రమరాంబ క్రియేషన్స్‌ పతాకంపై శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వేర్‌ ఈజ్‌ విద్యాబాలన్‌'. ఎల్‌.వేణుగోపాలరెడ్డి, పి.లక్ష్మినరసింహరెడ్డి, ఎ.చిరంజీవి నిర్మాతలు.

ఇక ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు...కొబ్బరి మట్ట అనే చిత్రం చేస్తూ బిజీగా ఉన్నాడు. అలాగే...సంపూర్ణేష్ బాబు హీరోగా... వైరస్ డాట్ కామ్ అనే పేరుతో ఓ వినూత్న చిత్రం తెరకెక్కుతోంది. (బి వేర్) అనేది ఉపశీర్షికతో వస్తున్న ఈ చిత్రానికి సీ.హెచ్. శివరామకృష్ణ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని ఎ.ఎస్.ఎన్ ఫిల్మ్స్ పతాకంపై సలీం, ఎ.జె. రాంబాబు సంయుక్తంగా నిర్మించనున్నారు.

English summary
Singam 123 starring burning star Sampoornesh Babu have lauched a Ugadi poster of the movie. This adrenaline pumping action cop entertainer is directed by a debutante Akshat Sharma.
Please Wait while comments are loading...