»   » కత్తిలాంటోడు లో ఏం జరుగుతోంది? సంపూర్నేష్ బాబు సరే మరి అలి సంగతేమిటీ?

కత్తిలాంటోడు లో ఏం జరుగుతోంది? సంపూర్నేష్ బాబు సరే మరి అలి సంగతేమిటీ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్ మూవీలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటిస్తాడని ఫిలింనగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. చిరు పక్కన ఉండే ఓ కామెడీ రోల్ కోసం సంపూను తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఈ రోల్ కోసం సునీల్‌ను ఆ తర్వాత వెన్నెల కిషోర్‌ను సంప్రదించారు. కానీ వాళ్లు కాల్ షీట్స్ ఎడ్జస్ట్ చేయలేకపోవడంతో.. ఈ సోషల్ మీడియా స్టార్‌ లైన్‌లోకి వచ్చినట్లు సమాచారం. 'కొబ్బరిమట్ట' సినిమా ట్రైలర్‌లో సంపూర్నేష్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగులు చిరును ఇంప్రెస్ చేయడంతో.. ఈ కామెడీ హీరోకు ఈ క్రేజీ ఆఫర్ దక్కిందని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవికి ఆమధ్య ఏదో సినిమా ఫంక్షన్ లో కలిసినప్పుడు హీరో సంపూర్ణేష్ బాబు త‌న చిత్రం కొబ్బ‌రిమ‌ట్ట టీజ‌ర్ చూపించాడట. ఆ టీజ‌ర్ ని చూసిన చిరంజీవి చాలా బాగుందని, కామెడిగా వుంటూ మంచి మెసెజ్ వుంద‌ని , డైలాగ్స్ రాసిన స్టీవెన్ శంక‌ర్ చాలా డెప్ట్ తో ఈ డైలాగ్స్ రాసాడ‌ని. సంపూ మాడ్యులేష‌న్ చాలా మెచ్యురిటిగా వుంద‌ని ప్ర‌శంశించారు. అంతేకాదు టీజ‌ర్ చూస్తున్నంత‌సేపు న‌వ్వుతూనే వుండ‌టం విశేషం. ఆ తర్వాతే సంపూర్నేష్ బాబుకి కత్తిలాంటోడు టీం నుంచి పిలుపొచ్చిందత. ఇప్పటికే కొన్నిడైలాగ్స్ సంపూతో చేయించడం, అంతా ఓకే అయిందని, రేపోమాపో బర్నింగ్ స్టార్ సంపూ కత్తిలాంటోడు సెట్స్ పైకి వెళ్లడం ఖాయమంటున్నారు.

Sampoornesh Babu To Act In Chiru 150th Movie

అయితే చిరు పక్కన ఉండే ఫ్రెండ్ గా కనిపించే సపోర్టింగ్ రోల్ కోసం కోసం ఇదివరకు అనుకున్న సునీల్, వెన్నెల కిషోర్ లని అనుకున్నా అది సాధ్య పడలేదు. ఈ పాత్రలో అలి ని తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. మొదటి రోజు సెట్లో కూడా అలి కనిపించటం తో ఆ పత్ర అలికే అనుకున్నారంతా. మరి మధ్యలో ఏమైందీ అర్థం కాలేదు గా సడెంగా బర్నింగ్ స్టార్ లైన్లోకి వచ్చాడు. అయితే అలి కి ఇచ్చింది వేరే పాత్రా..? లేదంటే సంపూనే ఇంకో సపరేట్ ట్రాక్ లో కనిపించ బోతున్నాడా అనే అనుమానాలూ ఉన్నాయి. మరి ఏది నిజమో ఏది కాదో తెలియాలీ అంటే ఇంకొన్నాళ్ళాగాల్సిందే...

English summary
Sampoornesh Babu To Act In Chiru 150th Film ... the direction of Director V.V.Vinayak in the film named "Kathilantodu" and now according to a recent gossip
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu