Just In
- 7 hrs ago
చిరంజీవి సినిమా ఫస్ట్‌షోకు వెళ్లా.. స్టెప్పులు డ్యాన్సులు చేశా.. మంత్రి అజయ్ కుమార్
- 8 hrs ago
రైతు బిడ్డ రైతే కావాలి.. ఆ రోజు వస్తుంది.. వ్యవసాయం లాభసాటిగా.. ఆవేశంగా ప్రసంగించిన చిరంజీవి
- 8 hrs ago
చిరంజీవి వారసత్వం ఎవ్వరికీ దక్కదు... ఆ స్థాయి ఆ ఒక్కడికే.. శర్వానంద్ షాకింగ్ కామెంట్స్
- 9 hrs ago
శర్వానంద్ నా బిడ్డలాంటి వాడు.. రాంచరణ్ ఫోన్ చేసి.. శ్రీకారం ఫంక్షన్లో చిరంజీవి ఎమోషనల్
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఓ రాశి విద్యార్థులు ఈరోజు ఫోన్, టివికి దూరంగా ఉండాలి...
- News
మోడీపై దీదీ గుస్సా.. దేశం పేరు కూడా మారుస్తారని ధ్వజం
- Finance
భారీగా పడిపోయిన బంగారం ధరలు, 10 గ్రాములు రూ.44,200 మాత్రమే!
- Sports
India vs England: 'సాహా అత్యుత్తమ కీపర్.. కొంతకాలం రెండో కీపర్‌గా కొనసాగించాలి'
- Automobiles
మీరు చూసారా.. ఓలా కంపెనీ నుంచి రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హీరోయిన్, ఆమె బాయ్ ఫ్రెండ్ అరెస్ట్
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ సనా ఖాన్, ఆమె బాయ్ ఫ్రెండ్ ఇస్మాయిల్ ఖాన్ అరెస్టయ్యారు. యువతిని వేధింపులకు గురి చేసిన కేసులో వీరిద్దరితో పాటు వారి సర్వెంట్ కూడా అరెస్టయ్యారు. మీడియా కన్సల్టెంటు పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వేధింపులకు గురి చేయడమే వీరి అరెస్టుకు కారణం.
ఈ సంఘటన గురించి ముంబై అంబలి పోలిస్ స్టేషన్ అధికారి రమేష్ ఖటారె వివరిస్తూ....‘సనా ఖాన్, ఇస్మాయిల్ ఖాన్, వారి సర్వెంట్ రాములను ఐపిసి సెక్షన్ 354, 506, 34 సెక్షన్ల కింద అరెస్టు చేసాము. మీడియా కన్సల్టెంట్ పూనమ్ ఖన్నా ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదు చేసాము' అని తెలిపారు.

అరెస్టు చేసిన వెంటనే కోర్టు ముందు ప్రవేశ పెట్టామని, వారు వెంటనే బెయిల్ పై విడుదలయ్యారని పోలీసాఫీసర్ తెలిపారు. అక్టోబర్ 21వ తేదీన ఓ న్యూస్ ఆర్టికల్ కు సంబంధించిన విషయంలో పూనమ్ ఖన్నాను వీరు వేధింపులకు గురి చేసారని, అందేరిలోని ఓ ఆసుపత్రి వద్ద ఈ సంఘటన చోటు చేసుకుందని తెలిపారు. ప్రస్తుతం పూనమ్ ఖన్నా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
సనా ఖాన్ గతంలో ఓ కిడ్నాపింగ్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. 15 ఏళ్ల యువతి తన కజిన్ మ్యారేజ్ ప్రపోజల్ రిజక్ట్ చేయడంతో ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. ఈ కేసులో సనా ఖాన్ యాంటిసిపటరీ బెయిల్‌పై ఉన్నారు. సనా ఖాన్‌కు ఈ యాంటిసిపటరీ బెయిల్ ఎలా వచ్చిందని క్వశ్చన్ చేస్తూ సదరు ఆర్టికల్ వచ్చింది. ఇందుకు సంబంధించిన న్యూస్ పూనమ్ ఖన్నా లీక్ చేసిందనే నెపంతో ఆమెను వేధింపులకు గురి చేసారు.
సనా ఖాన్ తెలుగులో కళ్యాణ్ రామ్ కత్తి, గగనం, మిస్టర్ నూకయ్య చిత్రాల్లో నటించింది. హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన ‘జై హో' చిత్రంలో నటించింది.