»   » బ్రియాన్ లారా మెచ్చుకున్న సందీప్ కిషన్ ఫిలిం..ఇదే (వీడియో)

బ్రియాన్ లారా మెచ్చుకున్న సందీప్ కిషన్ ఫిలిం..ఇదే (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ మొదటిసారి నిర్మాతగా వ్యవహరించిన ఓ షార్ట్ ఫిల్మ్ చూసి ఫిదా అయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకుని సందీప్ కిషన్ మురిసిపోతూ ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ మీరూ ఇక్కడ చూడండి.

మరి బ్రియాన్ లారాకు తెలుగు రాదు కదా...ఎలా అర్దమైంది అంటారా.. అసలు ఆ షార్ట్ ఫిలింలో మాటలు ఉంటే కదా! మూగ, చెవిటి అయిన ఓ అమ్మాయికి.. మాట్లాడగల, వినగల ఓ అబ్బాయికి మధ్య జరిగే ఓ స్వీట్ లవ్ స్టోరీ. ఆ షార్ట్ ఫిలిం ను మీరూ ఇక్కడ చూడవచ్చు.

కునాల్ కౌశిక్, ప్రాచీ థాకర్ జంటగా నటించిన 'సైలెంట్ మెలోడీ' అనే షార్ట్ ఫిలిం . ఈ షార్ట్ ఫిలిం కి ప్రశాంత్ వర్మ డైరెక్టర్. ట్రినిడాడ్ లో తన ఇంట్లో ఉండి యూ ట్యూబ్ లో ఈ సినిమాని చూస్తున్నట్లు బ్రియాన్ లారా ట్వీట్ చేశారు.

English summary
Sundeep Kishan tweeted:"And BrianLara tweets about our Short Film "The Silent Melody" Thank you Sir..Congrats Dir prasanthvarma :) "
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu