»   » తెలుగు సినిమాలు చేయను: అర్జున్ రెడ్డి దర్శకుడి సంచలనం

తెలుగు సినిమాలు చేయను: అర్జున్ రెడ్డి దర్శకుడి సంచలనం

Posted By:
Subscribe to Filmibeat Telugu
Arjun Reddy Director sensational comments on Controversy on his movie

విజయ్ దేవరకొండ, షాలిని పాండే హీరోహీరోయిన్లుగా నటించిన 'అర్జున్ రెడ్డి' సినిమా ఓవర్సీస్ బాక్సాఫీసు దుమ్ము దులుపుతోంది. యువతకు బాగా కనెక్ట్ అయిన ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబడుతోంది. తన రెండో సినిమాతోనే విజయ్ దేవరకొండ స్టార్ హీరోల రికార్డులను బద్దలు కొడుతున్నాడు.

రిలీజ్ ముందు యాంటీ ప్రమోషన్స్ తో పబ్లిక్ లోకి వెళ్లిన ఈ అర్జున్ రెడ్డి రిలీజ్ తర్వాత సరికొత్త రికార్డులతో సంచలనంగా మారింది. చూస్తుంటే ఈ సినిమా యూఎస్ లో 2 మిలియన్ మార్క్ అందుకునేలా కనిపిస్తుండగా టోటల్ రన్ లో సినిమా 30 కోట్లు వసూలు చేస్తుందని అంటున్నారు.యూఎస్ లో ఈ సినిమాకు ఎలాంటి కత్తెరలు పడలేదు. ఇక ఇలాంటి సినిమాలకు యూఎస్ లో ఈ రేంజ్ లో సక్సెస్ అవడం గొప్ప విషయం.

sandeep reddy vanga on arjun reddy controversy

అర్జున్ రెడ్డి సినిమాను యువత బాగా ఆదరిస్తున్నారు. కాకపోతే సినిమాపై మ‌హిళా సంఘాలు వ్యతిరేక గ‌ళ‌మెత్తాయి. సినిమా థియేటర్లకు వెళ్లి మరీ సినిమా చూడొద్దంటూ అడ్డుకుంటున్నాయి. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన సందీప్‌ రెడ్డి సినిమాలు తీయడంపై సీరియస్‌గా స్పందించారు.

సినిమాను అడ్డుకుంటే తాను ఏం చేయలేనని, మహిళా సంఘాలు ఎందుకు ఇలా అడ్డుకుంటున్నారో తనకు అర్థం కావట్లేదని అన్నారు. ఇలాగే భవిష్యత్తులో కూడా జరిగితే బాలీవుడ్‌కు వెళ్లి హిందీ, భోజ్‌పురి, కన్నడ భాషల్లో సినిమాలు తీసుకుంటానని సందీప్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడ కూడా అడ్డు తగిలితే ఇండియా వదిలి హాలీవుడ్‌లో సినిమాలు చేస్తానంటూ ఆశ్చర్యకరంగా మాట్లాడారు.

English summary
Sandeep Reddy Vanga sensational comments on Controversy on his new movie Arjun Reddy
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu