»   »  దేవదాసిని గా సంగీత

దేవదాసిని గా సంగీత

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sangeetha
'ఖడ్గం' సినిమాతో వెలుగులోకి వచ్చిన సంగీత ఆ తరువాత వరసగా తెలుగు,తమిళ భాషల్లో గ్లామర్ పాత్రలున్న సినిమాలు చేసింది. ఆ తరువాత 'శివపుత్రుడు' లో చేసిన దగ్గరనుండి ఆమెకు కాస్త నటనకు అవకాశమున్న పాత్రలు రావటం ప్రారంభమయ్యాయి. పెద్ద హీరోలందరితో కాకపోయినా మంచి ఆఫర్సే సంపాదించింది. కానీ ఆ తరువాత ఆమె హవా తగ్గిపోయింది. ఆ తరువాత 'బహుమతి' సినిమాలో చేసినా గుర్తుంచుకున్న వాళ్ళు కరువయ్యారు. ఇక తమిళంలో ఆమె ఆ మధ్య శ్రీరామ్ తో ఓ వెరైటీ పాయింటుతో నటించి అందరి దృష్టినీ ఆకర్షించింది. అందులో మరిదితో సంభంధం పెట్టుకునే వదిన పాత్రలో అదరికొట్టింది. దాంతో ఆమెకు కాస్త గుర్తింపు వచ్చి దానం(తెలుగులో కనకం) అనే సినిమాలో బుక్కయింది. కధ ప్రకారం సంగీత దేవదాసి కుటుంబంలో పుడుతుంది. తల్లి తండ్రులు వంశాచారం ప్రకారం ఆమెను దానం ఇచ్చేస్తారు. కానీ ఆమె అది ఇష్టపడక ఓ వ్యక్తిని పెళ్ళాడి బ్రతకాలనుకుంటుంది. కానీ చుట్టుప్రక్కలు సమాజం దాన్ని సాగనియ్యదు. మళ్ళీ ఆ ఆచారాన్ని అమలు చేయటానికి బలవంతంగా ప్రయత్నాలు చేస్తారు. వ్యభిచారి కావటం ఇష్టంలేని ఆమె ఎట్లా తనను చెరపట్టటానికి చూస్తున్న సమాజానికి బుద్ది చెప్పిందనేది క్లైమాక్స్ లో ఉద్విగ్నంగ చిత్రీకరిస్తారుట. అదీ సంగతి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X