For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Masooda Twitter Review: విభిన్నంగా తల్లి సెంటిమెంట్.. ప్లస్ లు మైనస్ లతో 'మసూద'.. భయపెట్టిందా అంటే..

  |

  హారర్ జోనర్స్ సినిమాలను తెరకెక్కించి హిట్ కొట్టడం అంటే అంతా మాములు విషయం కాదు. ఇటీవల కాలంలో అయితే హారర్ కి కామెడీ హంగులు అద్దించి నిర్మించారు. కానీ అందులో చాలా వరకు మంచి ఫలితాలను రాబట్టలేకపోయాయు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో మరో హారర్ చిత్రం రాబోతుంది. సీనియర్ హీరోయిన్ సంగీత ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ మూవీ మసూద. ఇందులో హీరో హీరోయిన్లుగా తిరువీర్, కావ్య కల్యాణ్ రామ్ నటించారు. సినిమా ట్రైలర్ చూస్తుంటే ఓ మధ్యతరగతి అమ్మాయికి దెయ్యం పట్టడమనే కథాంశంతో తెరకెక్కినట్లు తెలుస్తోంది. నవంబర్ 18 అంటే ఇవాళ విడుదలయ్యే ఈ సినిమా ట్విటర్ రివ్యూపై ఓ లుక్కేద్దామా!.

  హిట్టు బ్యానర్ లో మూడో సినిమాగా..

  హిట్టు బ్యానర్ లో మూడో సినిమాగా..

  మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ వంటి సక్సెస్ ఫుల్ సినిమాలు అందించిన తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ లో వస్తున్న మూడో చిత్రం మసూద. నిర్మాత రాహుల్ యాదవ్ నిర్మించిన ఈ సినిమాతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్ రామ్ తోపాటు సాయి కిరణ్, శుభలేక సుధాకర్ తదితర పాత్రలు పోషించారు.

  రౌడీ హీరోతో ట్రైలర్ రిలీజ్..

  రౌడీ హీరోతో ట్రైలర్ రిలీజ్..

  రౌడీ హీరో విజయ్ దేవరకొండ ట్రైలర్ లాంచ్ చేసిన మసూద చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రత్యేకంగా రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే క్రియేట్ అయ్యాయి. ఓ మధ్య తరగతి అమ్మాయికి దెయ్యం పడితే , దాన్ని సాల్వ్ చేసేందుకు ఆమె తల్లి ఓ భయస్తుడి సహాయం తీసుకుని కూతురిని ఎలా కాపాడిందనేదే సినిమా కథ అని తెలుస్తోంది. మసూద సినిమాపై నెటిజన్ల స్పందన ఎలా ఉందో తెలుసుకుందాం.

  ఆకట్టుకునే థ్రిల్లింగ్ సీన్స్..

  ఆకట్టుకునే థ్రిల్లింగ్ సీన్స్..

  హారర్ డ్రామాను ఇష్టపడే వారికి పూర్తి స్థాయిలో ఈ సినిమా ఆకట్టుకుంటుందట. ఇంటర్వెల్ కి ముందు వచ్చే కావ్య కల్యాణ్ రామ్ పాత్రకు సంబంధించిన హారర్ సన్నివేశాలు భయపెట్టెలా ఉన్నాయట. అలాగే కావ్య పాత్రతో ముడిపడి మిగిలిన పాత్రలు ఎమోషన్స్ అద్భుతంగా తీర్చి దిద్దారని టాక్. సంగీత-తిరువీర్ మధ్య వచ్చే థ్రిల్లింగ్ సన్నివేశాలు సినిమాకు బాగా ఉపయోగపడతాయని అంటున్నారు.

  విభిన్నంగా మదర్ సెంటిమెంట్..

  విభిన్నంగా మదర్ సెంటిమెంట్..


  కూతురుని కాపాడుకునే తల్లి పాత్రలో సంగీత క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయిందని టాక్. ఎప్పటిలాగే ఆమె నటనతో పాత్రలో ఇమిడిపోయారట. సంగీతతో సాగే తిరువీర్ ట్రాక్ ఒకటి అయితే.. ఒక సర్ ప్రైజ్ ఉంటుందట. క్లైమాక్స్ లో తల్లి సెంటిమెంట్ ను ఇలా కూడా చూపించొచ్చా అనే విధంగా డైరెక్టర్ మలిచారని ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే సన్నివేశాలు, ట్విస్ట్ ఆకట్టుకుంటాయట.

  ఫ్యామిలీతో చూడలేని విధంగా..

  ఫ్యామిలీతో చూడలేని విధంగా..

  ఇక హారర్ జోనర్స్ మెచ్చే ఆడియెన్స్ కు కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో బాగానే ఉన్నాయని నెటిజన్లు పొగుడుతున్నారు. అయితే ఫ్యామిలీ అంతా కలిసి చూసేందుకు కాస్త ఇబ్బందిగా ఉంటుందట. కొన్ని సన్నివేశాల్లో అందని లాజిక్, అంచనాలను అందుకోని స్క్రీన్ ప్లేతో కాస్తా నిరాశపరుస్తుందట.

  హారర్ ఆడియెన్స్ కు మాత్రం..

  హారర్ ఆడియెన్స్ కు మాత్రం..

  మసూద సినిమా ఒక హారర్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా చెబుతున్నారు. భారీ భయానక సన్నివేశాలతోపాటు లోతైనా ఎమోషన్ దాగి ఉందని నెటిజన్ల మాట. నటీనటుల యాక్టింగ్ స్కిల్ తో మసూద మెప్పిస్తుందట. అలాగే ఓవరాల్ గా హారర్ సినిమాలు చూసే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అందరూ చెబుతున్న మాట. కానీ క్లాస్ ఆడియెన్స్ కి మసూద అంతగా కనెక్ట్ కాదని మరో టాక్ వినిపిస్తోంది.

  English summary
  Swadharm Entertainment Banner And Sangeetha Kavya Kalyan Ram Starrer Movie Masooda Twitter Review
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X