»   » ఆ డైరెక్టర్ సైకో, నరకం చూపాడు ..... ఆ హాట్ సీన్లు చూసి నాన్న బాధపడ్డారు: సంజన

ఆ డైరెక్టర్ సైకో, నరకం చూపాడు ..... ఆ హాట్ సీన్లు చూసి నాన్న బాధపడ్డారు: సంజన

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Sanjana Sensational Comments On Her First Movie Director

  'బుజ్జిగాడు' ఫేం సంజన అలీతో సరదాగా షోలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 17 ఏళ్ల వయసులోనే తాను సినిమా ఇండస్ట్రీకి వచ్చానని, మోడలింగ్ చేసే రోజుల్లో బైక్ మీద తిరిగేదాన్ని, ఆ సమయంలో నాకు సినిమా అవకాశం వచ్చింది. దానికి సైన్ చేస్తే రూ. 2 లక్షల రెమ్యూనరేషన్‌ ఇస్తామన్నారు. అప్పటికి నాకు ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియదు. పెద్దగా అవగాహన కూడా లేని వయసు. ఈ సినిమా చేస్తే కారు కొనుక్కోవచ్చుకదా అనే కారణంతో సైన్ చేశాను. కానీ తొలి సినిమాకే నరకం చూశాను. ఆ సినిమా డైరెక్టర్ శాడిస్ట్, సైకో ప్రవర్తనతో ఇండస్ట్రీ అంటే భయం వేసేలా చేశాడు అని తెలిపారు.

  ఒక్క డైరెక్టర్ మీద తప్ప అందరి మీద గౌరవం ఉంది

  ఒక్క డైరెక్టర్ మీద తప్ప అందరి మీద గౌరవం ఉంది

  సంజన ‘గండ హెండతి' అనే కన్నడ సినిమా ద్వారా కెరీర్ ప్రారంభించింది. హిందీ మూవీ ‘మర్డర్'కు ఇది రీమేక్. ఈ ఒక్క సినిమా డైరెక్టర్ మీద తప్ప అందరు డైరెక్టర్ల మీద నాకు గౌరవం ఉంది అని సంజన తెలిపారు.

  చేయను అంటే బెదిరించాడు

  చేయను అంటే బెదిరించాడు

  ‘గండ హెండతి' మూవీ ముందు స్క్రిప్టు పూర్తిగా చదవకుండా సైన్ చేశాను. కానీ స్క్రిప్టు పూర్తిగా చూసిన తర్వాత ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లు ఎక్కువ ఉండటంతో దీనికి నేను న్యాయం చేయలేను అని నాకు ఇచ్చిన రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేందుకు వెళ్లాను. నువ్వు కాంట్రాక్టు మీద సంతకం చేశావు, సినిమా చేయకుంటే మోసం చేశావని కేసు పెడతాం అని డైరెక్టర్ బెదిరించాడని సంజన తెలిపారు.

  తప్పు చేయడం లేదని సిన్సియర్‌గా సైన్ చేశాను

  తప్పు చేయడం లేదని సిన్సియర్‌గా సైన్ చేశాను

  అప్పటికే నేను కాలేజీలో బాయ్స్, గర్ల్స్ మధ్య లవ్ ఎఫైర్స్ చూశాను, వారు ముద్దులు పెట్టుకోవడం చూశాను. అవన్నీ ఆ వయసులో సహజం. కెమెరా ఎదురుగా వెళ్లి కిస్ చేస్తే తప్పు ఏమిటి, అది ఒక పనిగా మాత్రమే చేస్తున్నాను, నిజం కాదు, నేను ఏమీ తప్పు చేయడం లేదు అనే ఉద్దేశ్యంతో సిన్సియర్‌గా సైన్ చేశాను... అని సంజన తెలిపారు.

  ఆ సీన్లు చూసి ఇలాంటి కూతురును ఎందుకు కన్నాను అని నాన్న బాధ పడ్డారు

  ఆ సీన్లు చూసి ఇలాంటి కూతురును ఎందుకు కన్నాను అని నాన్న బాధ పడ్డారు

  సినిమా విడుదలైన రోజు అమ్మా నాన్నతో కలిసి సినిమా చూశాను. సినిమాలో ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లు చూసి నాన్న హర్ట్ అయ్యారు. ఇలాంటి కూతురును ఎందుకు కన్నాను అని బాధ పడ్డారు. అయితే అమ్మ పక్కనే ఉండి సర్ది చెప్పింది అని సంజన గుర్తు చేసుకున్నారు.

   ఆ సీన్లు చేసేపుడు అమ్మను దూరంగా కూర్చోబెట్టారు

  ఆ సీన్లు చేసేపుడు అమ్మను దూరంగా కూర్చోబెట్టారు

  సినిమా షూటింగ్ సమయంలో అమ్మ నా వెంటే ఉండేది. అయితే ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లు చేసే సమయంలో అమ్మను దూరంగా అరకిలోమీటర్ దూరంలో కూర్చోబెట్టేవారు. థియేటర్లోకి వచ్చే వరకు అలాంటి సీన్లు ఉన్నాయని అమ్మకు కూడా తెలియదు అని సంజన తెలిపారు.

  అతడు సైకో, శాడిస్ట్ డైరెక్టర్

  అతడు సైకో, శాడిస్ట్ డైరెక్టర్

  ‘గండ హెండతి' సినిమాకు రవి శ్రీవాస్తవ దర్శకత్వం వహించారు. ఈ దర్శకుడి పేరు ఎత్తకుండా అతడి గురించి సంజన వివరించారు. సైన్ చేసే సమయం స్క్రిప్టు గురించి పూర్తిగా తెలియదు. స్క్రిప్టు చదివిన తర్వాత నేను ఈ సినిమా చేయలేను, డబ్బు తిరిగి ఇస్తాను అని చెబితే మోసం చేశావని కేసు పెడతానమని బెదిరించారు. షూటింగ్ సమయంలో అతడి ప్రవర్తన శాడిస్టులా, సైకోలా ఉండేది అని సంజన గుర్తు చేసుకున్నారు.

  డేంజర్ సీన్లు చేయించారు

  డేంజర్ సీన్లు చేయించారు

  షూటింగ్ సమయంలో అతడి శాడిస్టు, సైకో వేషాలతో చాలా విసిగిపోయాను. బ్యాంకాక్‌లో నది ఒడ్డున కొండపై నిల్చోబెట్టి ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా డేంజరస్ సీన్లు చేయించాడు. తొలి సినిమాతోనే సినిమా ఇండస్ట్రీ అంటేనే భయం వేసింది అని సంజన గుర్తు చేసుకున్నారు.

  నేనే ఏమైనా చేసుకుంటానేమో అని అమ్మ బాధ పడింది

  నేనే ఏమైనా చేసుకుంటానేమో అని అమ్మ బాధ పడింది

  ఆ సినిమాలో ముద్దు సీన్లు చేయడం వల్ల కాలేజీలో కూడా చాలా ఇబ్బంది పడ్డాను. ఫ్రెండ్స్ దూరం అయ్యారు. ఆ సమయంలో నేను చాలా బాధ పడ్డాను. ఏమైనా చేసుకుంటానేమో అని అమ్మ భయపడింది, నాకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసేది అని తెలిపారు.

  న్యూడ్ సీన్ వివాదంపై

  న్యూడ్ సీన్ వివాదంపై

  దండుపాళ్యం న్యూడ్ సీన్ వివాదంపై స్పందిస్తూ... తాను అసలు న్యూడ్ సీన్లో నటించలేదని, కొందరు దాన్ని ఎడిట్ చేసి న్యూడ్ గా ఉన్నట్లు ప్రచారం చేశారు అని సంజన స్పష్టం చేశారు.

   ఫ్రూట్ డైరెక్టర్ అని నేను అన్న విషయం తెలిసి రాఘవేంద్ర రావు వెంటనే అక్కడికి వచ్చారు

  ఫ్రూట్ డైరెక్టర్ అని నేను అన్న విషయం తెలిసి రాఘవేంద్ర రావు వెంటనే అక్కడికి వచ్చారు

  బుజ్జిగాడు సినిమా సమయంలో మోహన్ బాబుగారు, త్రిష అంతా కలసి సరదాగా మాట్లాడుకుంటున్నాం. ఆ సమయంలో రాఘవేంద్రరావుగారి ప్రస్తావన వచ్చింది. ఆయన నాకు తెలుసు... ఫ్రూట్ డైరెక్టర్ కదా అని చెప్పగానే వెంటనే మెహన్ బాబు గారు ఆయనకు ఫోన్ చేసి... ఒరేయ్ నువ్వు ఫ్రూట్ డైరెక్టర్ అంట అని చెప్పారు. ఆయన వెంటనే అక్కడకు వచ్చేశారు. నాకు చాలా భయం వేసింది. సార్ నేను తప్పుడు ఉద్దేశ్యంతో అనలేదు.... అని ఆయనకు వివరణ ఇచ్చేలోపే ఆయన గట్టిగా నవ్వేశారు అని సంజన గుర్తు చేసుకున్నారు.

  డాక్టర్‌తో ప్రేమలో ఉన్నాను

  డాక్టర్‌తో ప్రేమలో ఉన్నాను

  తాను ప్రస్తుతం ఓ డాక్టర్ తో ప్రేమలో ఉన్నానని, అయితే అతడి పేరును ఇప్పుడే బయటకు చెప్పను, త్వరలోనే అన్ని విషయాలు చెబుతాను అని సంజన తెలిపారు. ప్రస్తుతం బాహుబలి నిర్మాతలు నిర్మిస్తున్న ‘స్వర్ణ ఖడ్గం' అనే భారీ సీరియల్ చేస్తున్నట్లు వెల్లడించారు.

  English summary
  Sanjana sensational comments on her first movie director. She told tha he is a Psycho. After appearing in advertisements and in uncredited cameo roles in the films Soggadu and Panduranga Vittala, she got her first starring role in Ganda Hendathi.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more